PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-swetha-kesineni-nani8b19ae6c-9053-4511-b17d-53a04ab7d024-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-swetha-kesineni-nani8b19ae6c-9053-4511-b17d-53a04ab7d024-415x250-IndiaHerald.jpgవిజయవాడ ఎంపీ కేశినేని నాని తన పవర్ ఏంటో చూపించారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా తాను అనుకున్నది సాధించారు. కేశినేని నాని వార్నింగులకు భయపడ్డారో లేక మరేంటో తెలియదు కాని.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఖరారు చేశారు.kesineni swetha kesineni nani;nani;meera;naga;swetha;vijayawada;mp;naga aswin;sri venkateswara swamy;kesineni nani;mla;cheque;tdp;ycp;buddha venkanna;nagul meera;partyకేశినేని దెబ్బకు దిగొచ్చారుగా!కేశినేని దెబ్బకు దిగొచ్చారుగా!kesineni swetha kesineni nani;nani;meera;naga;swetha;vijayawada;mp;naga aswin;sri venkateswara swamy;kesineni nani;mla;cheque;tdp;ycp;buddha venkanna;nagul meera;partyThu, 04 Mar 2021 20:05:13 GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని తన పవర్ ఏంటో చూపించారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా తాను అనుకున్నది సాధించారు. కేశినేని నాని వార్నింగులకు భయపడ్డారో లేక మరేంటో తెలియదు కాని.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఖరారు చేశారు.

 విజయవాడ మేయర్ పదవికి టీడీపీ నుంచి చాలా మంది  పోటీపడ్డారు. అయితే ఇటీవల విజయవాడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కేశినేని శ్వేత వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ సర్క్యులర్ జారీ చేశారు. కేశినేని శ్వేత ఎంపీ కేశినేని నాని కుమార్తె.  మేయర్ పదవి రేసులో శ్వేతకు నందిరెడ్డి గాయత్రి నుంచి చివరివరకు పోటీ ఎదురైంది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ... నాని కుమార్తె శ్వేత పేరును తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.

బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత 11వ డివిజన్ లో కార్పొరేటర్ గా బరిలో ఉన్నారు.మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు శ్వేత టీడీపీ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ కార్పొరేషన్‌ను టీడీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తప్పుబట్టారు. ప్రభుత్వం సహకరించకున్నా వరల్డ్‌ క్లాస్‌ సిటీగా మారుస్తానని కేశినేని శ్వేత ప్రకటించారు.

ఇటీవల విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా శ్వేతను ఖరారు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే శ్వేత అభ్యర్థిత్వంపై మాజీ ఎమ్మెల్యే బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేరారని మరో వాదం వినిపిస్తోంది. 


సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త వ్యక్తి!

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>