Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gunea397e99-a801-4b20-af48-e864a1810d1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gunea397e99-a801-4b20-af48-e864a1810d1e-415x250-IndiaHerald.jpgసాధారణంగా స్కూల్కు వెళ్లే విద్యార్థి తన వెంట ఏం తీసుకెళ్తాడు.. ఒక బ్యాగ్ దాంట్లో బుక్కులు పెన్ పెన్సిల్ లాంటివి తీసుకెళ్తాడు.. లేదా తినడానికి ఏమైనా తెచ్చుకుంటాడు. స్కూల్ కు వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలాంటి వస్తువులు తీసుకు వెళ్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. కానీ అమెరికాలో మాత్రం ఒక విద్యార్థి తన వెంట తీసుకెళ్లిన వస్తువుతో ఉపాధ్యాయులె భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థి దగ్గర అలాంటి వస్తూ ఉండటంతో వెంటనే ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు వెంటనే పోలీసులకు Gun;police;school;floridaస్కూల్ కి గన్ తీసుకెళ్ళిన 11 ఏళ్ల బాలుడు.. తోటి విద్యార్థులకు గురిపెట్టి..?స్కూల్ కి గన్ తీసుకెళ్ళిన 11 ఏళ్ల బాలుడు.. తోటి విద్యార్థులకు గురిపెట్టి..?Gun;police;school;floridaThu, 04 Mar 2021 09:00:00 GMTసాధారణంగా స్కూల్కు వెళ్లే విద్యార్థి తన వెంట ఏం తీసుకెళ్తాడు.. ఒక బ్యాగ్ దాంట్లో బుక్కులు పెన్ పెన్సిల్ లాంటివి తీసుకెళ్తాడు.. లేదా తినడానికి ఏమైనా తెచ్చుకుంటాడు.  స్కూల్ కు  వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలాంటి వస్తువులు తీసుకు వెళ్తూ ఉంటాడు  అన్న విషయం తెలిసిందే. కానీ అమెరికాలో మాత్రం ఒక విద్యార్థి తన వెంట తీసుకెళ్లిన వస్తువుతో ఉపాధ్యాయులె భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థి దగ్గర అలాంటి వస్తూ ఉండటంతో వెంటనే ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా ఆ బాలుడు దగ్గర ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుని బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్న  ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది.  ఇంతకీ ఆ బాలుడు తన ఎలిమెంటరీ స్కూలుకు ఏ వస్తువు తీసుకెళ్లాడు అని అంటారా.. అతను ఏ టిఫిన్ బాక్సో, వాటర్ బాటిలో  తీసుకెళ్లలేదు ఏకంగా తన బ్యాగ్ లో ఒక గన్ తీసుకెళ్లాడు.  గన్ పెట్టుకొని తీసుకెళ్లడమే కాదు ఇక స్కూలుకు వెళ్లిన తర్వాత ఆ గన్ గురిపెట్టి పలువురు స్నేహితులను కూడా భయ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా లో చోటుచేసుకుంది.



 11 ఏళ్ల బాలుడు బ్యాగ్  లో తుపాకీ పెట్టుకుని రావడం కలకలం సృష్టించింది. అయితే ఇలా తుపాకీ వెంటబెట్టుకుని వచ్చిన బాలుడు ఫోర్త్ గ్రేడ్ చదువుతూ ఉండటం గమనార్హం. స్కూల్  వచ్చిన తర్వాత బ్యాగ్ లో ఉన్న గన్  తీసి అటు తోటి విద్యార్థులను కూడా బెదిరించాడుట. అయితే ఇది చూసిన ఉపాధ్యాయులు ఒక్కసారిగా అప్రమత్తం అయిపోయారు. అయితే మొదట ఆ గన్  చూసి భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు ఆ తర్వాత ఆ గన్ లో బుల్లెట్లు లేవు అని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.ఇక పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలున్ని అదుపులోకి తీసుకున్నారు.



బీజేపీ అలా నరుక్కొస్తొందా!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>