MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan125a1a1c-74c8-4e33-9c39-bf2386a61004-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan125a1a1c-74c8-4e33-9c39-bf2386a61004-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమా తెలుగులో రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. pawan kalyan;pawan;venkatesh;rana;aishwarya;aishwarya rajesh;geetha;kalyan;pawan kalyan;rana daggubati;sithara;thaman s;india;cinema;sangeetha;telugu;remake;daggubati venkateswara rao;march;amarnath k menon;sai pallaviపవన్ కళ్యాణ్‌కు హ్యాండు ఇచ్చిన మరోనటి.. ఎందుకంటే..!?పవన్ కళ్యాణ్‌కు హ్యాండు ఇచ్చిన మరోనటి.. ఎందుకంటే..!?pawan kalyan;pawan;venkatesh;rana;aishwarya;aishwarya rajesh;geetha;kalyan;pawan kalyan;rana daggubati;sithara;thaman s;india;cinema;sangeetha;telugu;remake;daggubati venkateswara rao;march;amarnath k menon;sai pallaviThu, 04 Mar 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమా తెలుగులో రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటిస్తుండగా.. బీజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నట్లు, పవన్ సరసన సాయి పల్లవి కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే సాయి పల్లవి తప్పుకుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.

ఇక తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఐశ్వర్య రాజేష్ కూడా తప్పుకుందని తెలుస్తోంది. ఈ మార్చిలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే అటు సాయి పల్లవి, ఇటు ఐశ్వర్యా రాజేష్‌లు ఇద్దరూ మార్చి బిజీగా ఉండడం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. దీంతో ఈ టాలెంటెడ్ నటీమణులు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేందేం లేక చిత్రబృందం మరో ఇద్దరిని వెతికే పనిలో ఉందట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం.




అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>