Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/juttu8cea2eb7-0fba-4cd7-8cf6-25479e0a4444-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/juttu8cea2eb7-0fba-4cd7-8cf6-25479e0a4444-415x250-IndiaHerald.jpgనల్లని ఒత్తయిన అందమైన జుట్టు ను కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్కరి కల కదా..మన అందాన్ని పెంచడంలో ఆరోగ్యకరమైన జుట్టు కీలక పాత్ర పోషిస్తు, ఎండా, వేడి నుంచి మెదడు భాగాన్ని రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుత కాలానుగుణంగా విపరీతమైన పొల్యూషన్,పని ఒత్తిడి, మన ఆహారంలో ఐరన్, జింక్, విటమిన్స్ , మినిరల్స్ లోపించడం వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోవడం, తెల్లబడడం వంటి అనేక రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రతిరోజు నియమాలు పాటిస్తే, మన ఆరోగ్యంతో పాటు అందమైన కురులు మీ juttu;iron;vitamin;pollution;almonds;divya bhatnagarఈ చిట్కాలు పాటిస్తే అందమైన, దృఢమైన నల్లని కురులు మీ సొంతం....ఈ చిట్కాలు పాటిస్తే అందమైన, దృఢమైన నల్లని కురులు మీ సొంతం....juttu;iron;vitamin;pollution;almonds;divya bhatnagarThu, 04 Mar 2021 02:00:00 GMTపొల్యూషన్,పని ఒత్తిడి, మన ఆహారంలో ఐరన్, జింక్, విటమిన్స్ , మినిరల్స్ లోపించడం  వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోవడం, తెల్లబడడం వంటి అనేక రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రతిరోజు  నియమాలు పాటిస్తే, మన ఆరోగ్యంతో పాటు అందమైన కురులు మీ సొంతం.

చాలామందిలో ఐరన్ లోపం కారణంగానే జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది.ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు పాలకూరలో పుష్కలంగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను తినటం వల్ల జుట్టు దృఢంగా ఉంటుంది.

బీట్‌రూట్‌లో అధికంగా లభించే  లైకోపిన్ శిరోజాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కనుక రోజువారి ఆహారంలో ఎక్కువగా బీట్ రూట్ ను తీసుకోవడం ఉత్తమం.
 
మెంతులు చుండ్రు ను తగ్గించడానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి.ఒక కప్పు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్న వాటిని మెత్తగా చేసి జుట్టుకి పట్టించి. నలభై నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే నల్లని ఒత్తయిన కురులు మీ సొంతం అవుతాయి

ఉసరి,పచ్చి బఠానీ, టొమాటోల్లో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ 'సి' పుష్కలంగా లభిస్తాయి.వీటిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

వెల్లుల్లిలో వెంట్రుకల ఎదుగుదలకు తోడ్పడే సల్ఫర్ అధిక మొత్తంలో లభ్యమవుతుంది. కాబట్టి దీన్ని కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

చిలకడ దుంపలో బీటాకేరోటిన్‌, విటమిన్‌-ఏ లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు మొదళ్లను బలంగా ఉంచుతాయి.

గుడ్లు, బాదంపప్పులలో జింక్‌, విటమిన్‌- ఈ , బయోటిన్‌ మొదలైనవి ఉంటాయి. బయోటిన్ జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర వహిస్తుంది ప్రతిరోజు గుడ్లను బాదం పప్పులు తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు, అందమైన శిరోజాలు మీ సొంతం అవుతాయి.

గుమ్మిడి గింజలలో కాపర్‌, జింక్‌, సిలీనియం, విటమిన్‌- ఈ, విటమిన్‌- బి, మెగ్నిషియం, ఓమేగా 6ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. వీటిని రోజూ ఆహారంగా తీసుకొంటే జుట్టు రాలే సమస్య పూర్తిగా  అవ్వడమే కాకుండా ,బట్టతల రాకుండా నివారించవచ్చు.


బీజేపీ తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయం

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>