PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-direction-to-janasena-to-deal-with-jagan73f7e4c2-983f-49cf-92d2-627a0c33037b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-direction-to-janasena-to-deal-with-jagan73f7e4c2-983f-49cf-92d2-627a0c33037b-415x250-IndiaHerald.jpgఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌లు చాల‌ని.. ఇక నుంచి ఎంతో కొంత స‌హ‌కారం అందించాల‌నిప‌వ‌న్‌కు తేల్చి చెప్పిన‌ట్టు వార్త‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. జ‌న‌సేన వ‌ర్గాలు ఈ వార్త‌ల‌ను తోసిపుచ్చుతున్నాయి. త‌మ నాయ‌కుడు బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌తో మాట్లాడిన మాట వాస్త‌వ‌మేన‌ని.. అయితే..జ‌గ‌న్‌తో నేరుగా స‌త్సంబంధాలు పెట్టుకోమ‌ని ఎక్క‌డా వారు చెప్ప‌లేద‌ని.. రాజ‌కీయ వైరుధ్యం ఉన్న రెండు పార్టీల మ‌ధ్య పొత్తులు ఎలా సాధ్య‌మ‌ని వారు ప్ర‌శ్నించా రు. అయితే.. వీరు కూడా ఎక్క‌డా.. జ‌గ‌న్‌ను jagan pawan kalyan;delhi;bharatiya janata party;andhra pradesh;letter;central government;partyజ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?jagan pawan kalyan;delhi;bharatiya janata party;andhra pradesh;letter;central government;partyThu, 04 Mar 2021 07:20:00 GMTఏపీ రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు నిశితంగా దృష్టి పెడుతున్నార‌ని తెలుస్తోంది. ఏపీ లో ఏం జ‌రుగుతోంది?  ఇక్కడ రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి..?  ముఖ్యంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీతోపాటు.. త‌మ‌కు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్న అధికార పార్టీ నేత జ‌గ‌న్ ప‌రిస్థితిని కూడా కేంద్రం లోని బీజేపీ నాయ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందిన తాజా స‌మాచారం ప్ర‌కా రం.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ .. బీజేపీతో పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీతో లోపాయికారీగా ఒప్పందం చేసుకుంద‌నే ఆరోప‌ణ‌లు జ‌న‌సేన‌ను చుట్టు ముట్టాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని పెద్దలు ప‌వ‌న్‌తో ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని.. తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌ను ప‌రోక్షంగా స‌హ‌క‌రించాల‌ని వారు సూచించిన‌ట్టు సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌లు చాల‌ని.. ఇక నుంచి ఎంతో కొంత స‌హ‌కారం అందించాల‌నిప‌వ‌న్‌కు తేల్చి చెప్పిన‌ట్టు వార్త‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. జ‌న‌సేన వ‌ర్గాలు ఈ వార్త‌ల‌ను తోసిపుచ్చుతున్నాయి. త‌మ నాయ‌కుడు బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌తో మాట్లాడిన మాట వాస్త‌వ‌మేన‌ని.. అయితే..జ‌గ‌న్‌తో నేరుగా స‌త్సంబంధాలు పెట్టుకోమ‌ని ఎక్క‌డా వారు చెప్ప‌లేద‌ని.. రాజ‌కీయ వైరుధ్యం ఉన్న రెండు పార్టీల మ‌ధ్య పొత్తులు ఎలా సాధ్య‌మ‌ని వారు ప్ర‌శ్నించా రు. అయితే.. వీరు కూడా ఎక్క‌డా.. జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌వ‌ద్దంటూ.. బీజేపీ నేత‌లు చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ దూకుడు మ‌రింత త‌గ్గిపోయింది. గ‌తంలో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లుగుప్పించిన ప‌వ‌న్‌.. ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌చ్చిన ఆదేశాలు.. మ‌రింత ఆస‌క్తిగా మారాయి. మ‌రి దీనిపై మ‌రింత క్లారిటీ రావాలంటే.. కొంత వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు. 


వావ్.. ఈ నదిని ఒక్కసారైనా చూడాల్సిందే బాసూ..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?

తెలుగు సినీ లవర్స్ కి పండగే.. ఈ వారంలో ఏకంగా 11 సినిమాలు రిలీజ్.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>