Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli70691a44-d2bc-4063-b03e-c08a559a406f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli70691a44-d2bc-4063-b03e-c08a559a406f-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచంలోని అనేకమంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు విరాట్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. గ్రేమ్ స్వాన్ మాత్రం ఇప్పటి టీమిండియా అంతగొప్పగా..virat kohli;samatha;sunil;varsha;sunil gavaskar;virat kohli;london;army;vవిరాట్ కంటే కంటే ధోనీ బెస్ట్.. గవాస్కర్‌కు షాకిచ్చిన స్పిన్నర్విరాట్ కంటే కంటే ధోనీ బెస్ట్.. గవాస్కర్‌కు షాకిచ్చిన స్పిన్నర్virat kohli;samatha;sunil;varsha;sunil gavaskar;virat kohli;london;army;vThu, 04 Mar 2021 20:01:42 GMTలండన్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రపంచంలోని అనేకమంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు విరాట్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. గ్రేమ్ స్వాన్ మాత్రం ఇప్పటి టీమిండియా అంతగొప్పగా ఏమీలేదని, తన దృష్టిలో ఒకప్పటి ధోనీ జట్టే బెస్ట్ అని అన్నాడు. అప్పటి ధోనీ జట్టు చాలా పటిష్ఠంగా ఉండేదని, అందుకే తన దృష్టిలో ఇప్పటికీ ఆనాటి టీమిండియానే పటిష్ఠమైన జట్టుగా భావిస్తానని స్వాన్ పేర్కొన్నాడు.
     
ప్రపంచ క్రికెట్‌లోనే పటిష్ఠమైన జట్లలో టీమిండియా తరపున విరాట్ సేన నిలుస్తుందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘విరాట్ జట్టును చూస్తుంటే 1990ల కాలంలో అప్పటి స్టీవ్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు గుర్తుకొస్తోంది. 1970-80లలో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో జైత్రయాత్ర కొనసాగించిన విండీస్ జట్టు గుర్తుకొస్తోంది’ అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించారు.

    
గవాస్కర్ వ్యాఖ్యలను స్వాన్ అంగీకరించలేదు. విరాట్ సేన పటిష్ఠ జట్టేనని, కానీ అప్పుడే ఈ జట్టును క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా వంటి వారు నడిపించిన దిగ్గజ జట్లతో పోల్చడం సరికాదని అన్నాడు. ఇప్పటికంటే భారత జట్టు 2012లోనే బాగుందని, ఆ జట్టుతో పోల్చితే విరాట్ సేన వెనకబడే ఉందని అభిప్రాయపడ్డాడు.

           
‘2012లో తాము ఆడిన జట్టు ఇప్పటికంటే పటిష్ఠంగా ఉంది. జట్టు చాలా సమతూకంగా ఉంది. ఆ జట్టు నాయకత్వం కూడా అద్భుతంగా ఉంది. ఆ జట్టును తామెలా ఓడించామో ఇప్పటికీ అర్థం కాదు. అందుకే తన దృష్టిలో విరాట్ సేనకంటే అప్పటి ధోనీ జట్టే బెస్ట్. జట్టు గొప్పతనం, కెప్టెన్‌గా విజయాలు అన్నీ జట్టు ఆటతీరుపై ఆధారపడి ఉంటాయి. అందుకే విరాట్‌ను అప్పుడే క్లైవ్ లాయిడ్, స్టీవ్‌వాల సరసన చేర్చడం సరికాదు’ అంటూ స్వాన్ వ్యాఖ్యానించాడు.


వేరే మహిళతో అడ్డంగా దొరికిన భర్త.. చితకబాదిన భార్య చివరకు ఏం చేసిందంటే..

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>