PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections378240d4-5d5a-4ca3-8e6a-28360f06d91f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections378240d4-5d5a-4ca3-8e6a-28360f06d91f-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో పుర పాలక ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మొన్న ఉదయం నుంచి మొదలైన విషయం తెలిసిందే.. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది.నామినేషన్ల ఉపసంహరణ విషయంలో వైకాపా, తెదేపా నేతలు ఘర్షణకు దిగారు. చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారు. వైకాపా నేతలను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న తెదేపా నేతలు ప్రయత్నించడంతో గొడవకు దారి తీసింది. నామినేషన్ల ఉపసంహరణలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెదేపా నాjagan-nimmagadda-elections;view;andhra pradesh;district;police;palamaner;tdp;ycp;gharshana;partyపుర పోరు: పలమనేరులో తారా స్థాయికి చేరిన టీడీపీ, వైసీపీ విభేదాలు !పుర పోరు: పలమనేరులో తారా స్థాయికి చేరిన టీడీపీ, వైసీపీ విభేదాలు !jagan-nimmagadda-elections;view;andhra pradesh;district;police;palamaner;tdp;ycp;gharshana;partyThu, 04 Mar 2021 09:11:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో పుర పాలక ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మొన్న ఉదయం నుంచి మొదలైన విషయం తెలిసిందే.. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది.నామినేషన్ల ఉపసంహరణ విషయంలో వైకాపా, తెదేపా నేతలు ఘర్షణకు దిగారు. చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారు. వైకాపా నేతలను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న తెదేపా నేతలు ప్రయత్నించడంతో గొడవకు దారి తీసింది. నామినేషన్ల ఉపసంహరణలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెదేపా నాయకులు ఆరోపించారు.


అలా మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరి పరస్పరం కొట్టుకొనే వరకు వెళ్లింది. మాటల యుద్ధం పెరగడంతో నేతలు అంతా ఒక్కసారిగా దాడికి ఎగబడ్డారు. తోపులాట తీవ్ర స్థాయికి  చేరడంతో అక్కడే ఉన్న పోలీసులకు ఇరు వర్గాలను అదుపుచేయడం కష్టంగా మారింది. అయితే పోలీసులు తీవ్రంగా శ్రమించి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినా కూడా కొద్ది సేపటి తరవాత మళ్లీ గొడవకు దిగారు. దీంతో మళ్లీ పోలీసులకు తల నొప్పిగా మారింది..


నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినందున ఇతరులను పురపాలక సంఘ కార్యాలయంలోకి అనుమతించబోమని పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అనంతరం వైకాపా, తెదేపాకు చెందిన కార్యకర్తలు, నేతలను కార్యాలయం నుంచి దూరంగా పంపించారు. నామినేషన్ల గడువు ముగిసేసరికి పలమనేరు పురపాలికలోని 26 వార్డులకు 18 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. చిత్తూరు జిల్లాలో మళ్లీ పంచాయితీ ఎన్నికల సీను రిపీట్ అయ్యింది. పుర పాలక ఎన్నికల్లో కూడా వైసీపీ పాగా వ్యూహాలు రచిస్తున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా నేతలతో భేటీ అవుతూ ఎన్నికల్లో వైసీపీ పై విజయం సాధించేందుకు అవసరమైన శక్తిని అభ్యర్థుల లో నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో ఈ నెల 15 తర్వాత తెలుస్తుంది..


పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>