MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha5a853105-21d1-47e6-a161-fd066f32e4c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha5a853105-21d1-47e6-a161-fd066f32e4c2-415x250-IndiaHerald.jpg శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్ ప్రాముఖ్యత చాల స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఆనంద్’ సినిమా నుండి ఈదర్శకుడు తీసిన ప్రతి సినిమాలోను హీరోయిన్ పాత్ర హీరో స్థాయికి మించి ఉంటుంది. దీనితో శేఖర్ కమ్ముల హీరోయిన్ పాత్రల పక్షపాతి అంటూ కొందరు కామెంట్స్ కూడ చేస్తూ ఉంటారు.ఇప్పుడు త్వరలో రాబోతున్న ‘లవ్ స్టోరీ’ మూవీ విషయంలో సాయి పల్లవి మ్యానియాను చూసి సమంత భయపడిపోతున్నట్లు టాక్.ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి మూడు పాటలు విడుదల అయ్యాయి. ఆ పాటలు అన్నీ హిట్ అయినప్పటికీ ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ‘సారంగ దరిsamantha;naga chaitanya;anand malayalam actor;samantha;sekhar;tiru;kamma;cinema;love;hero;heroine;chaitanya 1;anand deverakonda;sai pallavi;love storyసాయి పల్లవి ఆధిపత్యం పై సమంతకు పెరిగిపోతున్న ఖంగారు !సాయి పల్లవి ఆధిపత్యం పై సమంతకు పెరిగిపోతున్న ఖంగారు !samantha;naga chaitanya;anand malayalam actor;samantha;sekhar;tiru;kamma;cinema;love;hero;heroine;chaitanya 1;anand deverakonda;sai pallavi;love storyThu, 04 Mar 2021 09:10:32 GMTశేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్ ప్రాముఖ్యత చాల స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఆనంద్’ సినిమా నుండి ఈదర్శకుడు తీసిన ప్రతి సినిమాలోను హీరోయిన్ పాత్ర హీరో స్థాయికి మించి ఉంటుంది. దీనితో శేఖర్ కమ్ముల హీరోయిన్ పాత్రల పక్షపాతి అంటూ కొందరు కామెంట్స్ కూడ చేస్తూ ఉంటారు.ఇప్పుడు త్వరలో రాబోతున్న ‘లవ్ స్టోరీ’ మూవీ విషయంలో సాయి పల్లవి మ్యానియాను చూసి సమంత భయపడిపోతున్నట్లు టాక్.


ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి మూడు పాటలు విడుదల అయ్యాయి. ఆ పాటలు అన్నీ హిట్ అయినప్పటికీ ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ‘సారంగ దరియా’ పాట ఈసంవత్సరంలోని హిట్ పాటలలో టాప్ 3 లోకి చేరుతుందని అంచనాలు వస్తున్నాయి. ఈపాటకు లక్షలలో లైక్స్ కూడ వస్తున్నాయి.


‘సారంగ దరియా’ పాట బయటకు రాగానే జనం అంతా కేవలం సాయి పల్లవి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఈసినిమాలోని హీరో నాగచైతన్య గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘లవ్ స్టోరీ’ కథ అంతా సాయి పల్లవి చుట్టూ తిరుగుతుందని టాక్. దీనికితోడు ఈమూవీలోని నాగచైతన్య పాత్ర కూడ అంతంతమాత్రమే అన్న లీకులు వస్తున్నాయి.


సాధారణంగా చైతూ సినిమాల మంచి చెడ్డలు సమంత చూస్తూ ఉంటుంది. కొన్ని సినిమాల విషయంలో సమంత చొరవగా కలగచేసుకుని చైతన్య సినిమాల దర్శకులకు కొన్ని మార్పులు చేర్పులతో పాటు చైతన్య సినిమాలకు సంబంధించి కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తూ ఉండటం సమంత అలవాటు అని అంటారు. అయితే తాను తీసే సినిమాల విషయంలో శేఖర్ కమ్ముల ఎవరి మాటను పట్టించుకోడు అని టాక్. ఇప్పుడు సమంత విషయంలో కూడ ఆమె ఎంత ప్రయత్నించినా ఈమూవీ కథ విషయంలో చెప్పిన మార్పులను శేఖర్ కమ్ముల లైట్ గా తీసుకున్నాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. చైతన్యను టాప్ యంగ్ హీరోగా నిలబెట్టాలి అన్న ఉద్దేశ్యంతో అడుగులు వేస్తున్న సమంత ‘లవ్ స్టోరీ’ విడుదల అయ్యాకా జనం చైతూను పట్టించుకోకుండా కేవలం సాయి పల్లవిని గురించి మాత్రమే మాట్లాడితే ‘లవ్ స్టోరీ’ మూవీ వల్ల చైతన్యకు వచ్చే లాభం ఏమిటి అంటూ ప్రస్తుతం సమంత మధన పడుతున్నట్లు టాక్..  




పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>