BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/face-leamen-suger-shaningcfcae2d7-62f4-4aa3-b472-91299ad63028-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/face-leamen-suger-shaningcfcae2d7-62f4-4aa3-b472-91299ad63028-415x250-IndiaHerald.jpgఅందం కేవలం మగవలకు మాత్రమే సొంతం అనే సామెత నాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. అంతేస్థాయిలో మహిళలు కూడా అందంగా తయారవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏ వయసు వారికైనా చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే చర్మం జిడ్డుగా,నిర్జీవంగా, పొడిబారిపోయి కళ తప్పుతుంది. అంతేకాకుండా మొటిమలు రావడం, అలర్జీలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. face,leamen,suger,shaning;cheque"పంచదార బొమ్మలా" మెరవాలంటే ఏం చేయాలి..?"పంచదార బొమ్మలా" మెరవాలంటే ఏం చేయాలి..?face,leamen,suger,shaning;chequeThu, 04 Mar 2021 09:00:00 GMTఅందం కేవలం మగవలకు మాత్రమే సొంతం అనే సామెత నాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. అంతేస్థాయిలో మహిళలు కూడా అందంగా తయారవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏ వయసు వారికైనా చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే  చర్మం జిడ్డుగా,నిర్జీవంగా, పొడిబారిపోయి కళ తప్పుతుంది. అంతేకాకుండా మొటిమలు రావడం, అలర్జీలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి.


అయితే ఇలాంటి సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టాలి అంటే కేవలం స్క్రబ్ ద్వారానే సాధ్యమవుతుంది అంటున్నారు నిపుణులు. అయితే వీటి కోసం ఎలాంటి ఖర్చు చేయనవసరం లేదు.  కేవలం ఇంట్లో వుండే పంచదార చాలు. ఇది చర్మానికి మంచి స్క్రబ్లా పనిచేసి, చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి,చర్మం నిగనిగలాడుతూ ఉండేలా చేస్తుంది. అయితే ఇందుకోసం  ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


కావలసిన పదార్థాలు :
పంచదార ఒక టేబుల్ స్పూన్,
నిమ్మరసం అర టేబుల్ స్పూన్,
తేనె ఒక టేబుల్ స్పూన్.

తయారీ విధానం :
ఒక గిన్నె తీసుకొని అందులో పంచదార,నిమ్మరసం, తేనే అన్నీ ఒక్కొక్కటి చొప్పున వేస్తూ మిశ్రమంలా తయారు చేయాలి.

వాడే విధానం :
ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా ఒక కాటన్ వస్త్రంతో తుడిచి వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అర చేతిలోకి తీసుకొని,  ముఖానికి,మెడకు అప్లై చేసి సున్నితంగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఒక 15 నుంచి 20 నిమిషాలపాటు ఆరనిచ్చి, మరొకసారి చేతికి కాస్త తడి చేసుకుని,ముఖంపై మృదువుగా రుద్దుకోవాలి.ఇలా ఒక మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేస్తూ, ఆ తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ఇలా చేయడం వల్ల పంచదార చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది. ఇక నిమ్మరసం మచ్చలను, అలర్జీలను దూరం చేస్తుంది. తేనె చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది..

కాబట్టి కేవలం ఇంట్లో దొరికే ఈ పదార్థాలతో ముఖాన్ని అందంగా తాజాగా మార్చుకోవచ్చు.




బీజేపీ అలా నరుక్కొస్తొందా!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>