PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpgసాధార‌ణంగా.. తాను ప్రాతినిధ్యం వ‌హించే పార్టీపై ఎవ‌రికైనా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే.. ఎంతో పోటీలో కూడా టికెట్ ఇవ్వ‌డం.. గెలిచేందుకు దోహ‌ద‌ప‌డ‌డం వంటివి కార‌ణాలు ఉంటాయి. అయితే.. దీనిని కాద‌ను కుని వ‌చ్చేవారు కొంద‌రు ఉంటారు. అయితే.. క‌ర‌ణం విష‌యంలోనూ ఇలానే జ‌రిగినా.. ఆయ‌న‌కు టీడీపీకి మ‌ధ్య న 40 ఏళ్ళ సుదీర్ఘ అనుబంధం ఉంది. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న క‌ర‌ణం.. టీడీపీలోకి వ‌చ్చిన త‌ర్వా త‌. టీడీపీ ఆయ‌న‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చింది. ఆయ‌న ఎక్క‌డ కోరుకుంటే.. అక్క‌డ టికెట్ ఇచ్చింది. ఏప‌ద‌వి కావాల‌న్నాysrcp tdp;prema;love;mla;letter;tdp;chirala;ycp;partyఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?ysrcp tdp;prema;love;mla;letter;tdp;chirala;ycp;partyThu, 04 Mar 2021 08:53:00 GMTఔను! రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి మ‌న‌సు ఒక‌చోట‌.. మ‌నిషి ఒక చోట ఉంటే.. ఎలా ఉంటుంది ? ఆ నాయ‌కుల రాజ‌కీయం ఎటు దారితీస్తుంది ? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లే.. వెలుగు చూస్తున్నాయి. దీనికి కార‌ణం.. చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ ‌కృష్ణ‌మూర్తి చేస్తున్న రాజ‌కీయ‌మే! ఆయ‌న మ‌నిషిగా ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. కానీ, మ‌న‌సంతా మాత్రం తాను బ‌ల‌వంతంగా తెంచుకునివ‌చ్చిన‌.. టీడీపీలోనే ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న వ్య‌వ‌హార శైలి కూడా అలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
సాధార‌ణంగా.. తాను ప్రాతినిధ్యం వ‌హించే పార్టీపై ఎవ‌రికైనా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే.. ఎంతో పోటీలో కూడా టికెట్ ఇవ్వ‌డం.. గెలిచేందుకు దోహ‌ద‌ప‌డ‌డం వంటివి కార‌ణాలు ఉంటాయి. అయితే.. దీనిని కాద‌ను కుని వ‌చ్చేవారు కొంద‌రు ఉంటారు. అయితే.. క‌ర‌ణం విష‌యంలోనూ ఇలానే జ‌రిగినా.. ఆయ‌న‌కు టీడీపీకి మ‌ధ్య న 40 ఏళ్ళ సుదీర్ఘ అనుబంధం ఉంది. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న క‌ర‌ణం.. టీడీపీలోకి వ‌చ్చిన త‌ర్వా త‌. టీడీపీ ఆయ‌న‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చింది. ఆయ‌న ఎక్క‌డ కోరుకుంటే.. అక్క‌డ టికెట్ ఇచ్చింది. ఏప‌ద‌వి కావాల‌న్నా ఇచ్చింది. వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేలా ప్రోత్స‌హించింది.

ఇక‌, ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. టీడీపీ అండ‌గా నిలిచింది. అందుకే అద్దంకిని ఆయ‌న ఫ్యాక్ష‌న్ జోన్‌గా మార్చార‌నే వాద‌న ఉన్నా.. టీడీపీ చూసి చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. మ‌రి ఇంత చేసిన పార్టీని ఆయ‌న తెంచుకుని వైసీపీలో చేరిపోయారంటే.. అది పైపైకేన‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. కేవ‌లం ప్ర‌స్తుత అవ‌స‌రాల‌ను గ‌డుపుకొనేందుకు క‌రణం వేసిన ఎత్తుగ‌డ‌గానే భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆయ‌న వైసీపీలో ఉన్నా.. మ‌నిషి మాత్ర‌మే. అందుకే ఆయ‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ఆస‌క్తి చూపించ‌రు. పార్టీ నేత‌ల‌తో భేటీ అవ‌రు. పార్టీని బ‌లోపేతం కూడా చేయ‌రు. అంతేకాదు.. పోయి పోయి.. వైసీపీలో ర‌గ‌డ‌కు కూడా రీజ‌న్‌గా మారుతున్నారు.  ఆయ‌న టీడీపీ నేత‌గా అద్దంకిలో ఉన్నా గొడ‌వ‌లే... ఇప్పుడు వైసీపీ చెంత చీరాల‌లో ఉన్నా గొడ‌వ‌లే... అభివృద్ధి అన్న‌ది ఆయ‌న డిక్ష‌న‌రీలో ఉండ‌దా ? అన్నది సందేహ‌మే ? ఇన్ని కార‌ణాల‌ను బ‌ట్టి చూస్తే.. క‌ర‌ణం.. మ‌న‌సు టీడీపీలోను, మ‌నిషి వైసీపీలోను ఉన్నారంటే సందేహం ఏముంటుంది?! 


పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?

తెలుగు సినీ లవర్స్ కి పండగే.. ఈ వారంలో ఏకంగా 11 సినిమాలు రిలీజ్.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>