MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-fana-got-shocked-with-banny-latest-stratagyd1c3c036-6bd0-455a-bd0e-01e8e74ba12b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-fana-got-shocked-with-banny-latest-stratagyd1c3c036-6bd0-455a-bd0e-01e8e74ba12b-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ కు మెగా అభిమానులకు మధ్య ఎదో ఒక చిన్న గ్యాప్ కొనసాగుతూనే ఉంటుంది. బన్నీ ‘తన కట్టె కాలే వరకు’ చిరంజీవి అభిమానిగా కొనసాగుతాను అంటూ ఓపెన్ గా అనేక సార్లు చెప్పినా ఎందుకనో బన్నీని మెగా అభిమానులు పూర్తిగా ఇప్పటికీ విశ్వసించలేరు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల సందేహాలు వేరుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో బన్నీ సరికొత్త వ్యూహాల పై మెగా అభిమానులలో మళ్ళీ కలవరం మొదలైంది. దీనికి కారణం యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న ‘చావుకబురు చల్లగా’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈమూవీ ఫంక్షన్ కు అల్లు అర్జున్ మalluarjun;pawan;view;chiranjeevi;allu arjun;kalyan;karthikeya;kartikeya;cinema;hero;arjun 1అల్లు అర్జున్ సరికొత్త వ్యూహాల పై మెగా అభిమానులలో మళ్ళీ కలవరం !అల్లు అర్జున్ సరికొత్త వ్యూహాల పై మెగా అభిమానులలో మళ్ళీ కలవరం !alluarjun;pawan;view;chiranjeevi;allu arjun;kalyan;karthikeya;kartikeya;cinema;hero;arjun 1Thu, 04 Mar 2021 08:00:00 GMTఅల్లు అర్జున్ కు మెగా అభిమానులకు మధ్య ఎదో ఒక చిన్న గ్యాప్ కొనసాగుతూనే ఉంటుంది. బన్నీ ‘తన కట్టె కాలే వరకు’ చిరంజీవి  అభిమానిగా కొనసాగుతాను అంటూ ఓపెన్ గా అనేక సార్లు చెప్పినా ఎందుకనో బన్నీని మెగా అభిమానులు పూర్తిగా ఇప్పటికీ విశ్వసించలేరు.


ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల సందేహాలు వేరుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో బన్నీ సరికొత్త వ్యూహాల పై మెగా అభిమానులలో మళ్ళీ కలవరం మొదలైంది. దీనికి కారణం యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న ‘చావుకబురు చల్లగా’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈమూవీ ఫంక్షన్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వస్తున్నాడు.


ఇది పెద్ద విషయం కాదు కానీ ఈ మూవీ ఫంక్షన్ కు బన్నీ అతిధిగా వస్తున్న ఈవిషయాన్ని హైలెట్ చేస్తూ ఈమూవీ యూనిట్ వర్గాలు కొన్ని వెరైటీ వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘బన్నీ వస్తున్నారా..ఆయన వస్తున్నారా..ఒప్పుకున్నారా’ అంటూ భయంకరమైన ఎగ్జయిట్ మెంట్ విడియోలు కట్ చేసి వదలడమే కాకుండా ఆ వీడియోలను సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం మెగా అభిమానుల దృష్టి వరకు ముఖ్యంగా పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారి స్పందన వేరే రకంగా ఉంది. పవన్ కళ్యాణ్ చిరంజీవి లాంటి వారు ఒక చిన్న హీరో మూవీ ఫంక్షన్ కు వచ్చినట్లుగా హడావిడి చేస్తూ కేవలం బన్నీ అతిధిగా వస్తున్న విషయాన్ని హైలెట్ చేస్తూ ఇంత హడావిడి ఏమిటి అంటూ మెగా అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.


దీనికితోడు బన్నీ ఆ మధ్య కాకినాడలో షూటింగ్ కు వెళ్తే అభిమానులతో  ఊరేగింపు మొన్నటికి మొన్న మారేడిమిల్లి ఏరియాలో జనాల్లో ఊరేగింపు ఇవన్నీ చూస్తుంటే చాలా వ్యూహాత్మకంగా గా బన్నీ తనను తానే ఎలివేట్ చేసుకుంటూ చిరంజీవి పవన్ ల తరువాత మెగా హీరోలలో నెంబర్ వన్ స్థానం తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నాడు అంటూ కొందరు మెగా అభిమానులు ముఖ్యంగా పవన్ అభిమానులు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..    




స్టాలిన్‌ను ఓడిస్తానంటోన్న ఆ అప్స‌రా రెడ్డి ఎవ‌రంటే..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>