PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teacher-postsa8e7bdfa-af8d-4db9-9878-f1546494bf9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teacher-postsa8e7bdfa-af8d-4db9-9878-f1546494bf9c-415x250-IndiaHerald.jpgఏపీ నిరుద్యోగులకు ఇది అదిరిపోయే శుభవార్త.. బీఈడీ విద్యార్థులు ఎదురు చూస్తున్న శుభమూహూర్తం వచ్చేసింది.. రాష్ట్రంలో 15,926 నియామకాలకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చింది. వీటితో పాటు 402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడనుంది. మొత్తం ఏపీలో 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ముందు బ్యాక్ లాగ్‌ పోస్టులైన 402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి మినీ డీఎస్సీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మినీ డీఎస్సీ తర్వాత 15,926 నియామకాలకు డీఎస్సీ వేస్తారని తteacher-posts;mini;andhra pradesh;good news;good newwzఏపీ నిరుద్యోగులకు అదిరే గుడ్ న్యూస్.. 16 వేల ఉద్యోగాలు రెడీ..!ఏపీ నిరుద్యోగులకు అదిరే గుడ్ న్యూస్.. 16 వేల ఉద్యోగాలు రెడీ..!teacher-posts;mini;andhra pradesh;good news;good newwzThu, 04 Mar 2021 09:00:00 GMTఏపీ నిరుద్యోగులకు ఇది అదిరిపోయే శుభవార్త.. బీఈడీ విద్యార్థులు ఎదురు చూస్తున్న శుభమూహూర్తం వచ్చేసింది.. రాష్ట్రంలో 15,926 నియామకాలకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఉపాధ్యాయ ఖాళీలపై లెక్క తేల్చింది. వీటితో పాటు 402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడనుంది. మొత్తం ఏపీలో 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ముందు బ్యాక్ లాగ్‌ పోస్టులైన  402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి మినీ డీఎస్సీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


మినీ డీఎస్సీ తర్వాత 15,926 నియామకాలకు డీఎస్సీ వేస్తారని తెలుస్తోంది. డీఎస్సీతో పాటే టెట్‌నూ  నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉండడంతో డీఎస్సీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల హేతుబద్దీకరణ, బదిలీల తర్వాత ఖాళీల అంచనాపై ఓ అవగాహనకు వచ్చారు. అయితే మొత్తం 16వేలకుపైగా ఖాళీలు ఉన్నా.. ఆర్థికశాఖ ఎన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.


మొదట బ్యాక్‌లాగ్‌ డీఎస్సీ ప్రకటన వెలువడుతుంది. దీని పూర్తికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత 45 రోజులు సమయం తర్వాతే సాధారణ డీఎస్సీకి ప్రకటన ఉండొచ్చు. అంటే.. డీఎస్సీకి నాలుగైదు నెలలు పట్టే అవకాశం ఉంది. విశేషం ఏంటంటే..  రెండేళ్ల క్రితం ప్రకటించిన డీఎస్సీ-2018లోని అన్ని పోస్టులు ఇంకా భర్తీ కానేలేదు. మొత్తం 7,902 ఖాళీలకు ప్రకటన ఇచ్చారు. వాటిలో 860 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్లు తెలుగు, భాషా పండితులు కలిపి 374 వరకు ఉన్నాయి. మిగతావి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు.


అయితే టీచర్ ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న వారికి ఇది సరైన సమయం. ఇంకా డీఎస్సీకి కనీసం ఐదారునెలలు సమయం ఉన్నందువల్ల ఇప్పటి నుంచి సీరియస్ గా దృష్టి పెడితే టీచర్ ఉద్యోగం సంపాదించుకోవడం కష్టం కాదు. ప్రణాళిక బద్దంగా కష్టపడితే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆల్‌ ద బెస్ట్‌.




బీజేపీ అలా నరుక్కొస్తొందా!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>