EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-ktr3b594f76-22c9-4488-9f39-c96841637767-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcr-ktr3b594f76-22c9-4488-9f39-c96841637767-415x250-IndiaHerald.jpgజర్నలిస్టులకు ఇళ్లు.. ఇళ్ల స్థలాలు.. ఈ అంశంపై తెలంగాణ సర్కారు అనేక హామీలు ఇచ్చింది. స్వయంగా కేసీఆర్ జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని కొన్నేళ్ల క్రితమే ప్రకటించారు. అంతే కాదు.. రేపే వెళ్లి మీకు కావాలసిన భూములు వెదకండి.. రాసిచ్చేస్తా అంటూ హామీలు గుప్పించేశారు. ఈ కబుర్లు చెప్పి దాదాపు నాలుగైదేళ్లు గడిచిపోతున్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏళ్లూ పూళ్లు గడుస్తున్నా తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ జర్నలిస్టులకు కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయిందీ కేసీఆర్ సర్కారు. తెలంగాణ ఉద్యమంలో ముందుడి కొట్లాడిన వారkcr-ktr;kcr;ktr;suma;suma kanakala;hyderabad;telangana rashtra samithi trs;telangana;district;media;chief minister;press;kothapalli samuel jawaharకేసీఆర్ మాట ఇచ్చి తప్పారు.. కేటీఆర్ అయనా నిలబెట్టుకుంటారా..?కేసీఆర్ మాట ఇచ్చి తప్పారు.. కేటీఆర్ అయనా నిలబెట్టుకుంటారా..?kcr-ktr;kcr;ktr;suma;suma kanakala;hyderabad;telangana rashtra samithi trs;telangana;district;media;chief minister;press;kothapalli samuel jawaharThu, 04 Mar 2021 23:00:00 GMTతెలంగాణ సర్కారు అనేక హామీలు ఇచ్చింది. స్వయంగా కేసీఆర్ జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామని కొన్నేళ్ల క్రితమే ప్రకటించారు. అంతే కాదు.. రేపే వెళ్లి మీకు కావాలసిన భూములు వెదకండి.. రాసిచ్చేస్తా అంటూ హామీలు గుప్పించేశారు. ఈ కబుర్లు చెప్పి దాదాపు నాలుగైదేళ్లు గడిచిపోతున్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏళ్లూ పూళ్లు గడుస్తున్నా తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ జర్నలిస్టులకు కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయిందీ కేసీఆర్ సర్కారు.


తెలంగాణ ఉద్యమంలో ముందుడి కొట్లాడిన వారిలో జర్నలిస్టులూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి మీడియా సపోర్ట్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయినా తెలంగాణ వచ్చాక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయం మాత్రం మరుగునపడే ఉంది. ఇప్పుడు మరోసారి కేటీఆర్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అంటున్నారు.  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సహకారంతో ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు పలు విధాలుగా అండగా ఉంటోందన్నారు. కరోనా వేళ ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు అండగా నిలిచిందని..బాధిత జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20వేల రూపాయలు అందించిందని తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపు, జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, హైదరాబాద్ లోని జర్నలిస్టులకు ఇళ్లు, జవహర్ లాల్ నెహ్రు సొసైటీ కి పేట్ బషీరాబాద్ లోని స్థలాన్ని కేటాయించడం, చిన్న పత్రికల గ్రేడింగ్ తో పాటు పలు సమస్యలపై కేటీఆర్ జర్నలిస్టు నాయకులతో చర్చించారు.


గతంలో కేసీఆర్  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి మాట ఇచ్చి మరిచారు.. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా మరోసారి మాట ఇచ్చారు. మరి కేటీఆర్ అయినా మాట నిలబెట్టుకుంటారా.. కేసీఆర్ తరహాలోనే ఇచ్చిన మాట గాలికి వదిలేస్తారా.. అన్నది చూడాలి.




బొల్లి మచ్చలు వాటికీ మార్గాలు..?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>