PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber645b6906-cf26-4f4e-a663-bd427e91075c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber645b6906-cf26-4f4e-a663-bd427e91075c-415x250-IndiaHerald.jpgభారత్ పై చైనా దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. భారత ప్రభుత్వం ఎన్ని సార్లు చైనాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక భారత వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తున్న వార్తలపై చైనా దేశం స్పందించింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఔషధ సంస్థలపై చైనా సైబర్‌ దాడులకు పాల్పడిందంటూ సైఫిర్మా అనే అంతర్జాతీయ సంస్థ నివేదికను తోసిపుచ్చింది.cyber;vidya;india;media;thief;international;dongaభారత్‌పై సైబర్‌ దాడి.. మరోసారి చైనా ఏం చేసిందంటే..!?భారత్‌పై సైబర్‌ దాడి.. మరోసారి చైనా ఏం చేసిందంటే..!?cyber;vidya;india;media;thief;international;dongaThu, 04 Mar 2021 07:00:00 GMTభారత్ పై చైనా దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. భారత ప్రభుత్వం ఎన్ని సార్లు చైనాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక భారత వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తున్న వార్తలపై చైనా దేశం స్పందించింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఔషధ సంస్థలపై చైనా సైబర్‌ దాడులకు పాల్పడిందంటూ సైఫిర్మా అనే అంతర్జాతీయ సంస్థ నివేదికను తోసిపుచ్చింది. అయితే టీకా సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా హ్యకర్‌ బృందాలు దాడులు చేస్తున్నారని నివేదికలను తప్పుబట్టింది.

ఇక భారత్‌ పోర్టులపైనా చైనా హ్యాకర్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారంటూ రికార్డెడ్‌ ప్యూచర్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరిపై నిందలు వేయడం సరైంది కాదని తెలిపింది. ఇది దుర్మర్గమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. సంబంధిత నివేదికను భారత్‌ కూడా ఖండించినట్లు గమనించామని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

ఇది ఇలావుంటే మరో వైపు, భారత్‌లో ప్రతిష్టాత్మక సంస్థలు, వ్యతిరేక లక్ష్యంగా చైనా హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యుత్‌ వ్యవస్థలు, ఔషధ సంస్థల ఐటీ విభాగాలపై హ్యాకింగ్‌ కు పాల్పడినట్లు అంతర్జాతీయ సంస్థలు నివేదించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా భారత్‌లోని చైనా హ్యాకర్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారంటూ అమెరికాకు చెందిన సంస్థ అప్రమత్తం చేసింది. చైనా ప్రభుత్వం సహకారంతో కొనసాగుతున్న హ్యాకింగ్‌ బృందాలు భారత వ్యవస్థలపై గురిపెట్టినట్లు తెలుస్తోంది.

అయితే దేశంలో కీలక వ్యవస్థలు, సంస్థలపై చైనా సైబర్‌ దాడులకు పాల్పడుతుండటం గత సంవత్సరం నుంచే ప్రారంభమైందని రికార్డెడ్‌‌ ఫ్యూచర్‌ తెలియజేసింది. ఇక గల్వాన్‌ ఘటన తర్వాత ప్రభుత్వం చైనా యాప్‌ లను నిషేధించడంతో ఈ దాడులు మరింత తీవ్రమైనట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వార్తలను చైనా ఖండించింది.


హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>