MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-machiraju-facing-4eba0e42-7552-41b3-824e-599c5a77b2e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-machiraju-facing-4eba0e42-7552-41b3-824e-599c5a77b2e6-415x250-IndiaHerald.jpgఅమలాపురం అబ్బాయి ప్రదీప్ మాచిరాజు గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాం తో యాంకర్ గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత అనేక ప్రోగ్రాం లకు, ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ గా పాపులర్ అయ్యారు. అయితే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో ఆయన వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. pradeep machiraju;mahesh;pradeep;sriram;cinema;producer;blockbuster hit;audio;producer1;hero;silver;success;sid sriramయాంకర్ ప్రదీప్ వెంటపడుతున్న సినీ నిర్మాతలు..యాంకర్ ప్రదీప్ వెంటపడుతున్న సినీ నిర్మాతలు..pradeep machiraju;mahesh;pradeep;sriram;cinema;producer;blockbuster hit;audio;producer1;hero;silver;success;sid sriramThu, 04 Mar 2021 13:00:00 GMTప్రదీప్ మాచిరాజు గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాం తో యాంకర్ గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత అనేక ప్రోగ్రాం లకు, ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ గా పాపులర్ అయ్యారు. అయితే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో ఆయన వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాట పాడిన నీలి నీలి ఆకాశం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఒక్క పాటతోనే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలాగే ప్రదీప్ మాచిరాజు తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" వీక్షించేందుకు థియేటర్లకు భారీ ఎత్తున తరలివచ్చారు. బుల్లితెర యాంకర్ అయినప్పటికీ ప్రదీప్ కి హీరో రేంజ్ లో లక్షల మంది విశ్వసనీయమైన అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రదీప్ మొదటి సినిమాకి రూ. 8 కోట్ల షేర్ వచ్చిందని.. ఒక డెబ్ల్యు హీరో మూవీ ఆ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడం గొప్ప విషయమేనని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రదీప్ తో కలసి సినిమాలు చేయాలని నిర్మాతలు క్యూ కడుతున్నారు. చిన్న, పెద్ద సంబంధం లేకుండా ప్రతి ఒక్క నిర్మాత ప్రదీప్ వెంటపడుతూ తమతో సినిమాలు చేయాలని కోరుతున్నట్టు సమాచారం.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒక సాదాసీదా యాంకర్ అయిన ప్రదీప్ యొక్క మొదటి సినిమా కి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే విశేషం. అలాంటిది అతని మొదటి సినిమా బడ్జెట్ కి రెట్టింపుగా కలెక్షన్లు రాబట్టటం మరింత విశేషం. తొలి సినిమాతోనే సక్సెస్ అయిన ప్రదీప్ అనతి కాలంలోనే స్టార్ హీరో అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఏదైనా ఒక సినిమా ప్రదీప్ కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే ఇక అతడు తన సినిమా కెరీర్ లో వెనక్కి దిరిగి చూడరని అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్క్రిప్ట్ ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రదీప్ మరో మహేష్ బాబు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


గంటా..మంట. తంటా...?

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>