PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-centralc05f4c40-b127-420d-96ef-83fedbeb9b24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-centralc05f4c40-b127-420d-96ef-83fedbeb9b24-415x250-IndiaHerald.jpgరాజ‌కీయ పార్టీలు మ‌నుగ‌డ సాధించాలంటే వారికి కూడా ఒక దేవుడుండాలి. రాముడి పేరుతో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎలాగోలా దేశంలో బ‌తికేస్తోంది. ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ శివుణ్ని ప‌ట్టుకుంది. రాముడికి పోటీగా శివుణ్ని దింపుతోంది. జైశ్రీరాం అంటూ నిత్యం తనను ఇరుకున పెడుతున్న బీజేపీకి బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ విరుగుడు కనిపెట్టారు. bjp, central;mamata benerjee;shiva;deva;mamatha;nithya new;ramu;maha shivratri;bharatiya janata party;west bengal - kolkata;congress;lord siva;yuva;march;hindus;maha;partyబీజేపీకి రాముడు... తృణ‌మూల్‌కి శివుడుబీజేపీకి రాముడు... తృణ‌మూల్‌కి శివుడుbjp, central;mamata benerjee;shiva;deva;mamatha;nithya new;ramu;maha shivratri;bharatiya janata party;west bengal - kolkata;congress;lord siva;yuva;march;hindus;maha;partyThu, 04 Mar 2021 16:50:40 GMTకాంగ్రెస్ శివుణ్ని ప‌ట్టుకుంది. రాముడికి పోటీగా శివుణ్ని దింపుతోంది. జైశ్రీరాం అంటూ నిత్యం తనను ఇరుకున పెడుతున్న బీజేపీకి బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ విరుగుడు కనిపెట్టారు.

బీజేపీ హిందుత్వ‌లో హార్డ్‌వేర్ కంపెనీగా ఉంటే తృణ‌మూల్ ఇక నుంచి హిందుత్వ‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. రాముడికి విరుగుడుగా శివుణ్ని తెరపైకి తీసుకురావాలని మమత తలపెట్టింది. మహా శివరాత్రి పర్ దినాన ఆమె ఎన్నికల నామినేషన్‌ను వేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్న నేపథ్యంలో అక్కడే నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీని ఇరుకున పెట్టడానికే ఈ రోజును ఎంచుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం సందర్భంగా పాదయాత్రను చేపట్టాలని మమత ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు.

ప్రతి రోజు కొన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాలన్న తలపుంతో మమత ఉన్నట్లు సమాచారం. రోజురోజుకీ బీజేపీ చొచ్చుకొస్తున్న నేపథ్యంలో మమత విరుగుడు కనిపెట్టారు. అన్ని స్థానాలపై దృష్టి సారిస్తూనే.... బీజేపీకి పట్టున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్థులందర్నీ మ‌మ‌తా బెన‌ర్జీయే ఏరికోరి ఎంపిక చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరు అభ్యర్థిగా పోటీలోకి దిగినా మిగ‌తావారంతా  కచ్చితంగా సహకరించాలన్న నిబంధనను విధించారు. ఈ మేర‌కు కేడ‌ర్‌కు కూడా ఆదేశాలు జారీచేశారు. మార్చి 5న పార్టీ అభ్యర్థుల జాబితాను మమత ప్రకటించనున్నారు. ఈ జాబితాలో యువ నేతలతో పాటు మరికొందరి కొత్తవారికి కూడా అవకాశం కల్పించనున్నారు. ‘‘బెంగాల్ కూతురే సీఎం కావాలి’’ అన్న నినాదంతోనే మ‌మ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ల‌నున్నారు. ఇత‌ర నాయ‌కులు కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప్ర‌చారం చేయాల‌ని ఆదేశాలు జారీచేశారు.




యాదాద్రిలో కేసీఆర్... ఎన్నికల కోడ్ తో కాస్త

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>