QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimataef714ef4-bed3-4882-a2cb-04839c15ac88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimataef714ef4-bed3-4882-a2cb-04839c15ac88-415x250-IndiaHerald.jpgప్రతి రోజు లాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు మోసుకొచ్చింది.. అది ఏమిటంటే..బాధ్యతగా ఉన్న వారికి బాధలు ఎక్కువ.. నీతిగా ఉన్న వారికి నిందలు ఎక్కువ.. దీని వివరణ ఏమిటంటే.. ఎవరైనా వారి జీవితాలలో ఏదైనా ఒక విషయంలో బాధ్యత గా ఉన్నట్లయితే, వారికి అనేక బాధలు తలెత్తుతాయి.. అంతేకాకుండా నీతిగా, నిజాయితీగా ఉన్నవారికే సమాజంలో నిందలు కూడా ఎక్కువ.. అని దీని అర్థం. manchimata;dharma;jeevitha rajaseskhar;naina;indiaమంచి మాట : బాధ్యతగా ఉన్న వారికి బాధలు ఎక్కువ.. నీతి గా ఉన్న వారికి నిందలు ఎక్కువ...!మంచి మాట : బాధ్యతగా ఉన్న వారికి బాధలు ఎక్కువ.. నీతి గా ఉన్న వారికి నిందలు ఎక్కువ...!manchimata;dharma;jeevitha rajaseskhar;naina;indiaThu, 04 Mar 2021 06:00:00 GMTప్రతి రోజు లాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు  మోసుకొచ్చింది.. అది ఏమిటంటే..బాధ్యతగా ఉన్న వారికి బాధలు ఎక్కువ.. నీతిగా ఉన్న వారికి నిందలు ఎక్కువ.. దీని వివరణ ఏమిటంటే.. ఎవరైనా వారి జీవితాలలో ఏదైనా ఒక విషయంలో బాధ్యత గా ఉన్నట్లయితే, వారికి అనేక బాధలు తలెత్తుతాయి.. అంతేకాకుండా నీతిగా, నిజాయితీగా ఉన్నవారికే సమాజంలో నిందలు కూడా ఎక్కువ.. అని దీని అర్థం.


ఉదాహరణకు ఎవరైన ఒక పనిలో బాధ్యతగా ఉంటూ, నిజాయితీగా ముసులుకుంటున్నప్పుడు అది చూసి ఓర్వలేని ఎంతోమంది వారిని ఎలాగైనా తప్పుదోవ పట్టించాలనే నేపథ్యంలో వారిపై నిందలు వేస్తూ, వారిని అవమానాల పాలు చేస్తూ ఉంటారు.. నిజాయితీగా ఉండకపోవడమే కాకుండా నీతిగా ఉన్నవారిని కూడా చెడగొడుతూ ఉంటారు.. ఇక నీతిగా ఉన్నవారు వారి ధర్మాన్ని తప్పలేక, నలుగురిలో నిందల పాలవుతూ, బాధపడుతూ ఉంటారు..


 ఏ మనిషి అయినా జీవితంలో బాధ్యతగా,నిజాయితీగా మసులుకోవాలి. అప్పుడే మన జీవితానికి ఒక సార్ధకత ఉంటుంది. జీవితంలో బాధ్యత లేని వాడు కుటుంబాన్ని పోషించ లేడు.. బాధ్యత లేని వాడు ప్రస్తుతానికి సుఖంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం బాధ్యతగా ఉంటామో, అప్పుడే నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే కు వీలుగా ఉంటుంది..


అంతేకాకుండా మనం చేసే పనిలో నీతి, నిజాయితీ కలిగి ఉండాలి. అప్పుడే ధర్మం నాలుగు కాళ్ళ పై నిలబడి, న్యాయం నిజాయితీ వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి మనం చేసే ఏ పని లో నైనా బాధ్యతగా వ్యవహరిస్తూ, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి. అది చిన్న పనా లేక పెద్ద పనా అని ఆలోచించకూడదు
. చేసే ఏ పని అయినా బాధ్యతగా, నిజాయితీగా ఉండేలా చేయడమే మనిషి యొక్క సహజధర్మం..


చూశారు కదా ఫ్రెండ్స్.. మీరు కూడా మీ జీవితంలో బాధ్యతగా నిజాయితీగా మసులుకుంటూ,ఉన్నత శిఖరాగ్రం చేరాలని మేము కూడా కోరుకుంటున్నాం..




మార్చి 4వ తేదీ ప్ర‌త్యేక‌త అదే... విశేషాలేంటో తెలుసా..?

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>