PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan59a564eb-16a1-4ac5-8d32-e0599dba47d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan59a564eb-16a1-4ac5-8d32-e0599dba47d7-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ ఒక్కసారి కమిట్ అయితే ఆ పని చేసి తీరాల్సిందేనంటారు. కోర్టులు అడ్డు పడుతున్నా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కోసం ఆయన పడుతున్న ఆరాటం చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా కోర్టులో కేసులున్నా జగన్ ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఏపీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ విషయంలో విడుదలైన ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విజయవాడలో నిర్మించ తలపెట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడు విశాఖకు తరలిస్తున్నారు. cm jagan;jagan;andhra pradesh;high court;vishakapatnam;court;tdp;traffic police;ycpకోర్టు తీర్పుల్ని జగన్ అపహాస్యం చేస్తున్నారా..?కోర్టు తీర్పుల్ని జగన్ అపహాస్యం చేస్తున్నారా..?cm jagan;jagan;andhra pradesh;high court;vishakapatnam;court;tdp;traffic police;ycpThu, 04 Mar 2021 07:00:00 GMTజగన్ ఒక్కసారి కమిట్ అయితే ఆ పని చేసి తీరాల్సిందేనంటారు. కోర్టులు అడ్డు పడుతున్నా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కోసం ఆయన పడుతున్న ఆరాటం చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా కోర్టులో కేసులున్నా జగన్ ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఏపీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ విషయంలో విడుదలైన ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విజయవాడలో నిర్మించ తలపెట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడు విశాఖకు తరలిస్తున్నారు.

ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కి సంబంధించి విజయవాడలో రూ.13.80 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం తరలించబోతోంది. దీన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులిచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రతిపాదనలు పక్కనపెట్టింది. మూడూ రాజధానుల అంశంతో దీన్ని కూడా విశాఖకు తరలించాలని అనుకున్నారు. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్త ఆలస్యం అవుతోంది. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏపీ కమాండ్ కంట్రోల్ సేంటర్ నిర్మించాలని పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడం విశేషం. అయితే ఈ వ్యవహారంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని డీజీపీకి సూచించారాయన.

ప్రతిపక్షాల విమర్శలు..
మూడు రాజధానులు అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో... పరిపాలనా రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నానికి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తరలించే అంశం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు ఆల్రడీ విమర్శలు మొదలు పెట్టాయి. కోర్టు తీర్పుల్ని జగన్ అపహాస్యం చేస్తున్నారని మండిపడుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ని విశాఖ తరలించే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. 


హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>