PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/actor-radhika6b5832e3-f26f-454e-883c-7b820624aabe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/actor-radhika6b5832e3-f26f-454e-883c-7b820624aabe-415x250-IndiaHerald.jpgఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ వెల్లడించింది. అయితే చెన్నై లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ నటులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సినీ రాధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె కోసం రెండు నియోజకవర్గాలు పరిశీలిస్తున్నట్టు ఏఐఎస్‌ఎంకే వ్యవస్థాపకుడు, ఆమె భర్త శరత్‌ కుమార్‌ తెలిపారు. ఆమె కోసం తెన్‌కాశీ, వేలచెర్రి నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. బుధవారం పుదుకొట్టైలో నిర్వహించిన పార్టీ కార్యకactor radhika;kamal hassan;radhika;tiru;assembly;chennai;tamilnadu;husband;partyఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్న సినీ నటి..!ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్న సినీ నటి..!actor radhika;kamal hassan;radhika;tiru;assembly;chennai;tamilnadu;husband;partyThu, 04 Mar 2021 07:02:30 GMTచెన్నై లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ నటులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సినీ రాధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె కోసం రెండు నియోజకవర్గాలు పరిశీలిస్తున్నట్టు ఏఐఎస్‌ఎంకే వ్యవస్థాపకుడు, ఆమె భర్త శరత్‌ కుమార్‌ తెలిపారు. ఆమె కోసం తెన్‌కాశీ, వేలచెర్రి నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. బుధవారం పుదుకొట్టైలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో రాధిక మాట్లాడుతూ.. శరత్‌ కుమార్‌కు భయం లేదని, ఆయన కేవలం ఆప్యాయతకే తలవంచుతారన్నారు.


ఈ ఎన్నికలతో మార్పు వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. తమ నేత శరత్‌ కుమార్‌ చెబితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాధిక అన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐఎస్‌ఎంకే నుంచి శరత్‌ కుమార్‌ తిరుచెండూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే, అతన్ని గెలిపించేందుకు ఆమె చురుగ్గా ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రచారం చేశారు. అయిన కూడా ఆయన ఓటమి పాలయ్యారు.


ఇకపోతే, తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త పొత్తులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐఎస్‌ఎంకే, ఐజేకే పార్టీలు ఇటీవల కూటమిగా ఏర్పడగా.. కమల్‌హాసన్‌ స్థాపించిన ఎంఎన్‌ఎంతో కలిసి ఎన్నికల బరిలో నిలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు శరత్‌ కుమార్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన కమల్‌ను కలిసి చర్చించారు. తృతీయ కూటమి దిశగా కమల్‌ కూడా పావులు కదుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మూడు పార్టీల కూటమిపై ఇంకా అధికారిక ప్రకటన రాకముందే తమ సీఎం అభ్యర్థి కమల్‌ హాసనేనని శరత్‌ కుమార్‌ తాజాగా పుదుకొట్టైలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం విశేషం.. కమల్ హాసన్ కూడా అదే విధంగా గెలుపు ఖాయమని మాట్లాడటం ఊ తమిస్తుంది..


హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>