Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/australia-opener-david-warner-said-that-playing-with-india-was-not-a-good-decision1fb0c8fe-c6f4-4467-8d43-828eb9194582-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/australia-opener-david-warner-said-that-playing-with-india-was-not-a-good-decision1fb0c8fe-c6f4-4467-8d43-828eb9194582-415x250-IndiaHerald.jpgటీమిండియాతో టెస్టులు ఆడి తప్పు చేశానని ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమిండియాతో ఆడడం వల్ల ఇప్పటికీ జట్టులో స్థానం పొందలేకపోతున్నానని చెప్పాడు. ఒకవేళ ఆ టెస్టులు ఆడకున్నా బాగుండేదని, ఇప్పుటికల్లా జాతీయ జట్టు తరపున మళ్లీ బరిలోకి దిగే అవకాశం లభించేదని వార్నర్ అన్నాడు. టీమిండియాతో గతేడాది నవంబరులో..david warner;audi;australia;november;icc t20;paruguటీమిండియాతో ఆడకున్నా బాగుండేది.. వార్నర్ షాకింగ్ కామెంట్స్టీమిండియాతో ఆడకున్నా బాగుండేది.. వార్నర్ షాకింగ్ కామెంట్స్david warner;audi;australia;november;icc t20;paruguThu, 04 Mar 2021 18:54:37 GMTసిడ్నీ: టీమిండియాతో టెస్టులు ఆడి తప్పు చేశానని ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమిండియాతో ఆడడం వల్ల ఇప్పటికీ జట్టులో స్థానం పొందలేకపోతున్నానని చెప్పాడు. ఒకవేళ ఆ టెస్టులు ఆడకున్నా బాగుండేదని, ఇప్పుటికల్లా జాతీయ జట్టు తరపున మళ్లీ బరిలోకి దిగే అవకాశం లభించేదని వార్నర్ అన్నాడు. టీమిండియాతో గతేడాది నవంబరులో జరిగిన వన్డేల్లో ఆడే సమయంలో తాను గాయపడినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ గాయం పూర్తిగా నయం కాకముందే టెస్టులకు మళ్లీ ఆడాల్సి వచ్చిందని, ఆ టెస్టుల్లో ఆడడం వల్ల గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోందని వార్నర్ చెప్పుకొచ్చాడు.

‘‘మా జట్టుకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ చివరి రెండు టెస్టులాడాలనుకున్నా. ఇప్పుడు ఆలోచిస్తే తప్పు చేశానేమో అనిపిస్తోంది. గాయంతో ఆడడంతో దాని తీవ్రత మరింత పెరిగి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతోంది. నా గురించి ఆలోచించి ఉంటే కచ్చితంగా ఆడేవాణ్ని కాదు. జట్టుకు మేలు జరుగుతుందని అలా చేశా. ఉదరం, గజ్జల్లో ఇలాంటి నొప్పి ఇంతకుముందెప్పుడూ అనుభవించలేదు’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ముందుగా జరిగిన వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ సందర్భంగా ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా వార్నర్ ఆ మ్యాచ్ నుంచే కాకుండా.. ఏకంగా సిరీస్ నుంచే తప్పుకున్నాడు.

ఆ తరువాత జరిగిన టీ20 సిరీస్‌లో కూడా పాల్గొనలేదు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన 4 టెస్టులకు కూడా జట్టులో అతడిని ఎంపిక చేయలేదు. కానీ రెండో టెస్టు ఓటమి తరువాత ఆత్మరక్షణలో పడిన ఆసీస్.. మళ్లీ వార్నర్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. అయితే గాయం పూర్తిగా తగ్గకుండానే జట్టులోకి వచ్చిన వార్నర్.. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆ మ్యాచ్‌ల్లో వరుసగా 5, 13, 1, 48 పరుగులు మాత్రమే చేశాడు.


టీచర్లకు టీఆర్ఎస్ నేతల వార్నింగ్!

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>