ViralDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/sri-gandham-chatulu74999f8f-9f21-4f41-8001-1ee34031a3c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/sri-gandham-chatulu74999f8f-9f21-4f41-8001-1ee34031a3c6-415x250-IndiaHerald.jpgకేవలం 20 చెట్లతో రూ.30 లక్షలా అంటే చాలా విడ్డూరంగా ఉందే..అని అనుకుంటారు. కానీ ఎలా సంపాదించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఆ చెట్లు ఏవో కాదు శ్రీ గంధం చెట్లు. నల్గొండ జిల్లా పసూరు గ్రామానికి చెందిన రైతు ఇస్తారపురెడ్డి తన పొలం గట్టు పై పెంచిన 20 చెట్లను విక్రయించగా రూ. అక్షరాల 36 లక్షల ఆదాయం వచ్చిందట.sri gandham chatulu;telangana;australia;district;nalgonda;vegetable market;thota chandrasekhar;international;miryala ravinder reddy;reddyవైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?sri gandham chatulu;telangana;australia;district;nalgonda;vegetable market;thota chandrasekhar;international;miryala ravinder reddy;reddyThu, 04 Mar 2021 12:00:00 GMTకేవలం 20 చెట్లతో రూ.30 లక్షలా అంటే చాలా విడ్డూరంగా ఉందే..అని అనుకుంటారు. కానీ ఎలా సంపాదించాడో  తెలిస్తే నోరెళ్లబెడతారు. ఆ చెట్లు ఏవో కాదు శ్రీ గంధం చెట్లు.  నల్గొండ జిల్లా పసూరు గ్రామానికి చెందిన రైతు ఇస్తారపురెడ్డి తన పొలం గట్టు పై పెంచిన 20 చెట్లను విక్రయించగా రూ. అక్షరాల 36 లక్షల ఆదాయం వచ్చిందట.


ఈ మొక్కల ద్వారా సెంటు, పౌడర్, ఖరీదైన సబ్బులు, ఇతర కాస్మోటిక్స్ తయారీలలో వినియోగిస్తారు. గంధం ధర కిలో రూ 10 వేల వరకు పలుకుతోంది. అంతేకాకుండా శ్రీగంధం చెట్లకు అంతర్జాతీయ మార్కెట్ లో లక్షల్లో డిమాండ్ ఉంటుంది. ఈ మొక్కలను ఎక్కడైనా పెంచుకోవచ్చు. అంతేకాకుండా చెట్ల మధ్య అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు.


శ్రీ గంధం చెట్లు స్వతహాగా ఆహారాన్ని తీసుకోలేదట. అందుకోసం సపోర్టింగ్  కంది, శనగ వంటి అంతర పంటలను అంతర పంటలను వేస్తే, వీటి నుంచి శ్రీ గంధం మొక్కలు ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత ఏడాది నుంచి ఆస్ట్రేలియా టేక్, మలబార్, మామిడి తదితర మొక్కలను నాటవచ్చు. ఇవి శ్రీ గంధం మొక్కలకు ఆహారాన్ని అందించడంతో పాటు రైతు కు ఆదాయం కూడా తెచ్చిపెడతాయి.


అంతేకాకుండా శ్రీగంధం చెట్ల పెంపకం పై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు ఇస్తాపురెడ్డి, రవీందర్ రెడ్డి.. 50 మందితో కలిసి తెలంగాణ శ్రీగంధం రైతు పరస్పర సహకార సొసైటీ ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా కే. ఇస్తాపు రెడ్డి  రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. " 2002లో 20 మొక్కలను మూడెకరాల బత్తాయి తోట గట్టు పైన నాటాను. కానీ సపోర్టింగ్ మొక్కలను పెంచలేదు. అవి పెరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న బత్తాయి మొక్కలు చనిపోయాయి. దీంతో శ్రీగంధం మొక్కలను అలాగే వదిలేశా. అందువల్ల పక్కనున్న మొక్కలు సహాయంతో అవి పెరిగి పెద్దవయ్యాయి. కొన్ని రోజుల తర్వాత ఒక చెట్టుకు ఎవరో రంధ్రాలు చేసి వెళ్ళారు. అటవీశాఖ అధికారులకు చెప్పడంతో కోతకొచ్చాయో..లేదో.. అని దొంగలు పరిశీలించారని చెప్పారు. కొన్నేళ్ళ తర్వాత గాలివానకు చెట్లు కూలడంతో, దానిని కొడుతుంటే సెంటు వాసన వచ్చింది. దీంతో అటవీ శాఖ అనుమతి తీసుకొని హైదరాబాదులోని డీలర్ చెప్పిన విధంగా జాగ్రత్త గా కట్ చేసి విక్రయించారు.

అవగాహన లేకపోవడంతో కిలో 6 వేలకు విక్రయించారు. 20 చెట్లకు  రూ. 36 లక్షల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా ఇప్పుడు 600 మొక్కలు పెంచుతున్న వాటి వయస్సు రెండేళ్లు. అని చెప్పుకొచ్చారు ఇస్తాపురెడ్డి.




కూతురు పై తండ్రే అలా చేస్తున్నాడా.. ఛీ.. ఛీ..

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>