MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/alekhyafe650b53-c814-4189-8e5a-250a1a806a5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/alekhyafe650b53-c814-4189-8e5a-250a1a806a5f-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో ప్రజలకు కలిగిన ఇబ్బంది ని గమనించి స్వచ్చంధంగా నటి అలేఖ్య ఏంజెల్ తన శక్తి మేరకు ఆదుకుని వారికి చేయూతనిచ్చింది. కరోనా కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. కరోనా విజృంభణ అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని చేపట్టగా ఈ లాక్ డౌన్ లో సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. నిత్యావసర సరుకులకు ప్రజలు పడే పాట్లను చూడలేక అలేఖ్య నిరుపేదలకు అండగా నిలబడ్డారు. వారికి ఆహారాన్ని అందించారు. నిత్యవసరాలు పంపిణీ చేశారు.alekhya;dadasaheb phalke;alekhya;kavitha;variar;cinema;media;hero;girl;service;prati roju pandage;kalvakuntla kavitha;shakti;misterనటి అలేఖ్య ఏంజెల్‌కు అరుదైన గౌరవం..ఎమ్మెల్సీ కవిత సన్మానం..!!నటి అలేఖ్య ఏంజెల్‌కు అరుదైన గౌరవం..ఎమ్మెల్సీ కవిత సన్మానం..!!alekhya;dadasaheb phalke;alekhya;kavitha;variar;cinema;media;hero;girl;service;prati roju pandage;kalvakuntla kavitha;shakti;misterWed, 03 Mar 2021 16:34:06 GMTకరోనా సమయంలో ప్రజలకు కలిగిన ఇబ్బంది ని గమనించి స్వచ్చంధంగా నటి అలేఖ్య ఏంజెల్ తన శక్తి మేరకు ఆదుకుని వారికి చేయూతనిచ్చింది. కరోనా కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. కరోనా విజృంభణ అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని చేపట్టగా ఈ లాక్ డౌన్ లో సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. నిత్యావసర సరుకులకు ప్రజలు పడే పాట్లను చూడలేక అలేఖ్య నిరుపేదలకు అండగా నిలబడ్డారు. వారికి ఆహారాన్ని అందించారు. నిత్యవసరాలు పంపిణీ చేశారు.


సినిమా పరిశ్రమలో ఇబ్బందుల్ పడ్డ అందరిని ఆమె ఆదుకున్నారు. దాంతో లాక్ డౌన్ టైం లో తాను చేసిన సేవలకు గానూ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ సంస్థ వారు కొవిడ్ వారియర్ రియల్ హీరో 2021 అవార్డు ను అందజేశారు. దాదాపు న‌ల‌భై వేల మందికి పైగా నిరుపేద‌ల‌కు నిత్యవసరాలను పంపిణీ చేశారు అలేఖ్య.. అయితే ఓ తెలుగు అమ్మాయి ఈ అవార్డును అందుకోవడంతో ఆమెకు రాజకీయ ప్రముఖుల దగ్గరినుంచి ప్రశంశలు లభించాయి.. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమెను సత్కరించారు. ఎమ్మెల్సీ కవితను తాను కలిసిన విషయాన్ని అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలతో తెలియజేయగా ఈ ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశ్యంతో అలేఖ్య ఏంజెల్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఇలా సేవ చేయాలనుకునే ఎంతోమంది కి ఆదర్శంగా నిలిచింది. ఆమె ఇంకా గొప్ప గొప్ప సేవ కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు అన్నారు.. ఇకపోతే ప్రతి రోజు పండగే, అక్కడొకడున్నాడు, మిస్టర్ మనీ, ఆనందం మళ్ళీ మొదలైంది, ఆ ఐదుగురు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అలేఖ్య




విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>