PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vspf79f4c17-1ea4-483f-9539-c06c72e4034f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vspf79f4c17-1ea4-483f-9539-c06c72e4034f-415x250-IndiaHerald.jpgవిశాఖలో రాజకీయం వేగంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడానికి వైసీపీ అన్ని రకాల అస్త్రాలను బయటకు తీస్తోంది. విశాఖ కార్పోరేషన్ గెలుచుకోవడమే కాదు, వైజాగ్ సిటీలో టీడీపీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి అధికార పార్టీ సిద్ధపడిపోయింది. vsp;visakhapatnam;mp;district;telugu;vishakapatnam;minister;cycle;cheque;tdp;ycp;prajarajyam party;kasi;master;partyపుర పోరు : విశాఖలో టీడీపీ భారీ షాక్... వైసీపీలోకి గంటా...?పుర పోరు : విశాఖలో టీడీపీ భారీ షాక్... వైసీపీలోకి గంటా...?vsp;visakhapatnam;mp;district;telugu;vishakapatnam;minister;cycle;cheque;tdp;ycp;prajarajyam party;kasi;master;partyWed, 03 Mar 2021 16:23:42 GMTవైసీపీ అన్ని రకాల అస్త్రాలను బయటకు తీస్తోంది.  విశాఖ కార్పోరేషన్ గెలుచుకోవడమే కాదు, వైజాగ్ సిటీలో  టీడీపీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి అధికార పార్టీ సిద్ధపడిపోయింది.

దాంతో విశాఖ టీడీపీలో భూకంపమే పుడుతోంది. వైసీపీలోకి తాజాగా మాజీ మంత్రి గంటా కుడి భుజం లాంటి నేత కాశీ విశ్వనాధ్ చేరిపోయారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన కాశీ విశ్వనాధ్ వైసీపీలో చేరడంతో ఒక్కసారిగా టీడీపీకి షాక్ తగిలినట్లు అయింది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాశీవిశ్వనాధ్ జిల్లా రాజకీయాల్లో తనదైన వర్గాన్ని కలిగి ఉన్నారు. ఆయన రాకతో జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ మరింతగా పట్టు బిగించడం ఖాయమని తేలిపోయింది. ఇక వైసీపీలోకి గంటా రైట్ హ్యాండ్ రంగ ప్రవేశం చేయడంతో గంటా రావడమే తరువాయి అంటున్నారు.

దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. గంటా కూడా వైసీపీలోకి వస్తారని ఆయన చెప్పుకొచ్చారు. గంటా రాకకు అధినాయకత్వం  అనుమతిస్తే కచ్చితంగా చేర్చుకుంటామని కూడా చెప్పేశారు. అంటే లోపాయికారిగా గంటా వైసీపీలోకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయ‌నే అర్ధమవుతోంది. గంటా కనుక వస్తే ఇక విశాఖ సిటీ వరకూ టీడీపీ పూర్తి స్థాయిలో దెబ్బ తినిపోవడం ఖాయమని కూడా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే విశాఖ  టీడీపీ నుంచి మరింతమంది పెద్ద తలకాయలు కూడా చేరడానికి సిధ్ధంగా ఉన్నారని అంటున్నారు. దాంతో మేయర్ ఎన్నిక పూర్తిగా వైసీపీకే అనుకూలంగా ఉందని అంటున్నారు. ఇక వైసీపీ టీడీపీని సిటీలో పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కూడా మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా అర్ధమవుతోంది. దాంతో  విశాఖ రాజకీయం పూర్తిగా రసకందాయంలో పడినట్లు అయింది. అంతే కాదు విశాఖలో వీలు అయినన్ని సీట్లు గెలుచుకోవడం ద్వారా విశాఖలో మొత్తానికి సైకిల్ కి బ్రేకులు వేయాలని అనుకుంటున్నారు.








నటి అలేఖ్య ఏంజెల్‌కు అరుదైన గౌరవం..ఎమ్మెల్సీ కవిత సన్మానం..!!

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>