PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేటితో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. ఈరోజు మూడు గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. దీంతో అధికార వైసీపీ ఎలా అయినా తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తూ ఇప్పటికే తమ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో పాటు ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థులు మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం కార్పొరేషన్ తో పాటు ఎన్నికలు జరుగుతున్న ఎన్నిjagan nimmagadda elections;hari;hari music;andhra pradesh;district;telugu;tdp;ycp;partyపురపోరు :అనంతలో టార్గెట్ 'టీడీపీ' క్యాండిడేట్లు ?పురపోరు :అనంతలో టార్గెట్ 'టీడీపీ' క్యాండిడేట్లు ?jagan nimmagadda elections;hari;hari music;andhra pradesh;district;telugu;tdp;ycp;partyWed, 03 Mar 2021 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేటితో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. ఈరోజు మూడు గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. దీంతో అధికార వైసీపీ ఎలా అయినా తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తూ ఇప్పటికే తమ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో పాటు ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థులు మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం కార్పొరేషన్ తో పాటు ఎన్నికలు జరుగుతున్న ఎన్ని మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీలో అధికార పార్టీ నుంచి మేయర్ చైర్మన్ రేసులో ఉన్న నాయకులు ఆయా డివిజన్లు వార్డులలో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థుల మీదనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.. 

వారిని నయానో భయానో పోటీ నుంచి తప్పించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఏకంగా టిడిపి అభ్యర్థిని తప్పించేందుకు వారికి 30 లక్షల దాకా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫర్ ఒప్పుకుని పక్కకు తప్పుకుంటే 30 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తామని లేదంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి అనంతపురం కార్పొరేషన్ విషయంలో అధికార పార్టీ నుంచి ఇప్పటికే నలుగురు మేయర్ రేసులో ఉన్నారు. 

ఎవరికి వారు వీలైనంతగా టీడీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని చెబుతున్నారు. అయితే ముందుగానే జాగ్రత్త పడిన టిడిపి తమ అభ్యర్థులను ఎవరికీ కనిపించకుండా క్యాంపు రాజకీయం మొదలు పెట్టింది. దీంతో మొదటి రోజు వ్యూహం బెడిసికొట్టడంతో ఈ రోజు అయిన వీలైనంతగా నామినేషన్లు ఉపసంహరింప చేయాలని అధికార పార్టీకి సంబంధించిన వారు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ఈరోజు మూడు గంటల తర్వాత పోటీలో ఎవరు నిలవనున్నారు అనే అంశం మీద క్లారిటీ రానుంది.




బండి సంజయ్ ని ఒక ఆట ఆడుకున్న కేటిఆర్

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>