PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-3-years-kid-pinni-appartment-throwing109b2c71-6543-43d5-ad9c-a3b6dc1aa6e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-3-years-kid-pinni-appartment-throwing109b2c71-6543-43d5-ad9c-a3b6dc1aa6e1-415x250-IndiaHerald.jpgదేశం అంత అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుని వెళ్తున్నాగాని మనుషులు మాత్రం అలానే కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు. రోజు రోజుకీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మనం మనుషులం అనే సంగతిని మర్చిపోయి క్రూరాతి క్రూరంగా పగతో , ద్వేషంతో మానవ మృగంగా మారి ఎదుటి వారి ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడడం లేదు అనడానికి ఈ బాలుడి హత్యే ఒక ఉదాహరణ.కన్న తల్లి స్థానంలో ఉన్న ఒక మహిళ అభం శుభం ఎరగని ఒక చిన్న బాలుడిని పొట్టన బెట్టుకుంది.. మరో కన్న తల్లి పేగు బంధాన్ని తెంచేసింది.. మనిషి అన్న పదానికే మాయని మచ్చ తెస్తున్నాడు.. hyderabad, 3 years kid,pinni, appartment, throwing;women;cbn;ganga;kumaar;manu;ganges;police;husband;womanకనివిని ఎరగని ఘోరం.. మూడేళ్ళ పసివాడి ప్రాణాన్ని తీసిన కసాయి పినతల్లి..!?కనివిని ఎరగని ఘోరం.. మూడేళ్ళ పసివాడి ప్రాణాన్ని తీసిన కసాయి పినతల్లి..!?hyderabad, 3 years kid,pinni, appartment, throwing;women;cbn;ganga;kumaar;manu;ganges;police;husband;womanWed, 03 Mar 2021 17:30:00 GMT

దేశం అంత అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుని వెళ్తున్నాగాని మనుషులు మాత్రం అలానే కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు. రోజు రోజుకీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మనం మనుషులం అనే సంగతిని మర్చిపోయి క్రూరాతి క్రూరంగా పగతో , ద్వేషంతో   మానవ మృగంగా మారి ఎదుటి వారి ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడడం లేదు అనడానికి ఈ బాలుడి హత్యే ఒక ఉదాహరణ.కన్న తల్లి స్థానంలో ఉన్న ఒక మహిళ అభం శుభం ఎరగని ఒక చిన్న బాలుడిని పొట్టన బెట్టుకుంది.. మరో కన్న తల్లి పేగు బంధాన్ని తెంచేసింది.. మనిషి అన్న పదానికే మాయని మచ్చ తెస్తున్నాడు.. 




 వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌ పాతబస్తీలోని ఈదీ బజార్‌ కుమార్ వాడికి చెందిన మహ్మద్‌ ఎతేషాముద్దీన్‌ (32), సుజావుద్దీన్‌ (27) అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే భవనంలో కలిసి నివసిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం ఎతేషాముద్దీన్‌కు అస్మాసిద్దికా (26)తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒకకుమార్తె  పుట్టింది. కానీ కేవలం ఐదు రోజులకే మరణించింది. తర్వాత మూడేళ్ళ క్రితం ఓ బాబు పుట్టాడు.ఆ బాబుకి నుమానుద్దీన్‌ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అందులోను ఆ కుటుంబంలో అందరూ పెద్దవారు అవ్వడంతో  చిన్నవాడు అయిన నుమాద్దీన్ ను అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే బాబాయి అయిన  సుజావుద్దీన్‌కు ఆయేషాబాను (24)తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే తన భర్త సుజావుద్దీన్ కూడా తన తోడికోడలు పిల్లాడిని ప్రేమగా చూసుకోవడం నచ్చలేదు. దీనితో బాలుడిపై ద్వేషం పెంచుకుంది. గతంలో బాలుడిని కరెంట్ షాక్ తో చంపాలని కూడా చూసిందట, అలాగే పసివాడి చేతి  వేళ్ళు తెలుపులో పెట్టి నొక్కడం వంటి వికృతి చేష్టలు చేసింది. అది తెలిసి  కుటుంబ సభ్యులు అయేషాబా ను తీవ్రంగా మందలించడంతో  అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. తిరిగి  పెద్దలు నచ్చ చెప్పడంతో కొన్ని రోజుల క్రితం అత్తవారింటికి తిరిగి వచ్చింది.




అయినాగానీ తనలో మార్పు రాలేదు. ఈసారి ఏకంగా చంపేయాలనుకుంది.. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బాలుడిని భవనం రెండో అంతస్తుపైకి తీసుకెళ్లింది. బాలుడి చేతులు, కాళ్లు పట్టుకుని భవనంపై నుంచి కిందకు తోసేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు  వద్దని వారించినా కూడా వినకుండా పసివాడిని రెండు అంతస్థుల పై నుంచి కిందకు విసిరేసింది. బాలుడికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు చెప్పారు.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ చిన్నారి జీవి5తం అర్ధంతరంగా గాల్లో కలిసిపోయింది. ఆ తల్లి తండ్రులు, కుటుంభ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితురాలు ఆయేషాబానును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






బ్రేకింగ్: జనసేనకు బిజెపికి చింతమనేని ప్రచారం

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>