Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/crimead95dcfd-b9f5-496d-bb29-2a5bac4b2f5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/crimead95dcfd-b9f5-496d-bb29-2a5bac4b2f5e-415x250-IndiaHerald.jpgఆడుకుందామని ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక చోటకు చేరారు. వారు అనుకున్నట్టే గేమ్ స్టార్ట్ చేశారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉన్నా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని ఒక్కసారిగా ఆ ఫ్రెండ్స్ మధ్యన గొడవ స్టార్ట్ అయ్యింది. చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారినట్టుగా తీవ్ర స్థాయికి చేరింది వీరి గొడవ. స్నేహితుల గొడవ కాస్త రెండు గ్రామాల గొడవగా మారిపోయింది. ఆ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. ఈ గేమ్ ఆడటానికి వచ్చిన వారంతా నూజివీడులోని ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. టైం పాస్ కి వాళ్లంతా ఒక చోటు కూcrime;siddharth;geum;huzur nagar;police;nuziveedu;gharshana;anandamపబ్జీ ఆడదామని వెళ్లారు.. కానీ వారి మధ్యే ఓ రేంజ్ లో పబ్జీ ఫైట్ జరిగిందిగా..పబ్జీ ఆడదామని వెళ్లారు.. కానీ వారి మధ్యే ఓ రేంజ్ లో పబ్జీ ఫైట్ జరిగిందిగా..crime;siddharth;geum;huzur nagar;police;nuziveedu;gharshana;anandamWed, 03 Mar 2021 15:00:00 GMTగేమ్ స్టార్ట్ చేశారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉన్నా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని ఒక్కసారిగా ఆ ఫ్రెండ్స్ మధ్యన గొడవ స్టార్ట్ అయ్యింది. చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారినట్టుగా తీవ్ర స్థాయికి చేరింది వీరి గొడవ. స్నేహితుల గొడవ కాస్త రెండు గ్రామాల గొడవగా మారిపోయింది. ఆ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.  ఈ గేమ్ ఆడటానికి వచ్చిన వారంతా నూజివీడులోని ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. టైం పాస్ కి వాళ్లంతా ఒక చోటు కూర్చొని గేమ్ ఆడదామనుకున్నారు.
 ఈ మధ్యనే పబ్ జీ గేమ్ బ్యాన్ అయినా.. అలాగే ఉండే మరెన్నో గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక వారంతా అలాంటి గేమే ఆడటం మొదలు పెట్టారు. అయితే వీరి మధ్యన గొడవ గేమ్ నుంచి స్టార్ట్ అయ్యిందో? లేక గేమ్ నే అడ్డుపెట్టుకునే గొడవ స్టార్ట్ చేశారో తెలియదు కానీ.. ఆ స్నేహితుల ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇక పిల్లల గొడవను ఆపాల్సింది పోయి ఏ ఊరి పిల్లలకు ఆ ఊరి గ్రామస్తులు సపోర్ట్ ఇచ్చారు. ఇంకేముంది ఇరు గ్రామాల మధ్యన గొడవ రాళ్లు.. కర్రలతో కొట్లాడుకునే స్థాయికి చేరకుంది. నూజివీడు మండలం కొత్తూరు తండా, సిద్ధార్థ్ నగర్ గ్రామాల మధ్యనే ఈ గొడవ జరిగింది.

ఈ గొడవలో రెండు వర్గాలకు చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నూజివీడు ఏరియా హాస్పటల్లో చేర్పించారు. ఇక ఈ ఘటనపై నూజివీడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటలకు వయసుతో సంబంధం లేదంటారు. ఆటలు ఆడితే.. మనసుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగించాలి. ఆటలంటే మానసిక ఆనందంతో పాటుగా శరీరాన్ని ధ్రుడంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ నేటి కాలం ఆటలు మాత్రం మనిషిని మూర్కంగా తయారు చేస్తున్నాయి. నేరాలకు, ఘోరాలకు దారి తీసేందుకు ప్రేరేపించే విధంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 


పురపోరు : అనంతలో ఉపసంహరణల జోరు..ఏకంగా అన్నా ?

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>