PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-bjp-ycp-breking-janasena-lateste7da7f6f-51f0-4b39-b16b-924285bb516c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-bjp-ycp-breking-janasena-lateste7da7f6f-51f0-4b39-b16b-924285bb516c-415x250-IndiaHerald.jpg పుర‌పాల‌క సంఘాల్లో ఎలాగైనా పాగా వేయాలి.. మ‌న పార్టీ జెండానే ఎగ‌రాలి.. అందుకు ఏమైనా చేయాలి.. చైర్మ‌న్ స్థానంలో మ‌న పార్టీవారే కూర్చోవాలి.. అందుక‌వ‌స‌ర‌మైన అన్నిర‌కాల ఉపాయాలు ప్ర‌యోగించండి.. నామినేషన్ల ఉపసంహరణకు బుధివారం తుది గడువు కావడంతో ఈలోగా ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడండంటూ అధికార పార్టీ నేత‌లు స్థానిక నేత‌ల‌కు హుకుం జారీచేశారు. దీంతో వారంతా ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు. tdp, bjp, ycp, breking, janasena, latest;hari;hari music;bharatiya janata party;telugu desam party;kiliveti sanjeevaiah;janasena;y. s. rajasekhara reddy;congress;district;telugu;mla;tdp;local language;ycp;janasena party;cpi;petta;partyపుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపుపుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపుtdp, bjp, ycp, breking, janasena, latest;hari;hari music;bharatiya janata party;telugu desam party;kiliveti sanjeevaiah;janasena;y. s. rajasekhara reddy;congress;district;telugu;mla;tdp;local language;ycp;janasena party;cpi;petta;partyWed, 03 Mar 2021 09:13:40 GMTపుర‌పాల‌క సంఘాల్లో ఎలాగైనా పాగా వేయాలి.. మ‌న పార్టీ జెండానే ఎగ‌రాలి.. అందుకు ఏమైనా చేయాలి.. చైర్మ‌న్ స్థానంలో మ‌న పార్టీవారే కూర్చోవాలి.. అందుక‌వ‌స‌ర‌మైన అన్నిర‌కాల ఉపాయాలు ప్ర‌యోగించండి.. నామినేషన్ల ఉపసంహరణకు బుధివారం తుది గడువు కావడంతో ఈలోగా ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా  చూడండంటూ అధికార పార్టీ నేత‌లు స్థానిక నేత‌ల‌కు హుకుం జారీచేశారు. దీంతో వారంతా ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు.

‘‘గెలిచేది మేమే.. అధికారం మాదే.. మధ్యలో మీరేంటి!?’’ అంటూ వీరంతా బెదిరింపులకు దిగారు. పై నుంచి అండ ఉండ‌టంతో కిందిస్థాయిలో చెల‌రేగిపోతుత‌న్నారు. నామినేషన్లు ఉపసంహరించుకుంటే రాబోయే మూడేళ్లలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా  ఇస్తున్నారు.

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట పుర‌పాల‌క సంఘాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రత్యర్థి పార్టీలతో రాజీ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడు రోజులుగా చెంగాళమ్మ త‌ల్లి ఆలయంలో వైసీపీ నేతలు రాజీ చర్చలు జరుపుతున్నారు. సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ  నేతలు, అభ్యర్థులతో వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రాజీ చర్చలు జ‌రిపారు. టీడీపీ నేత వేనాటి రామచంద్రారెడ్డి 4 కౌన్సిలర్‌ స్థానాలు, ఓ కోఆప్షన్‌ పదవి తమ పార్టీకి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అందుకు కిలివేటి అంగీకరించినట్లు సమాచారం. అలాగే బీజేపీ నేతలతో చర్చలు జరిపి వారికి ఒకటో, రెండో కౌన్సిలర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 25 వార్డులు ఉండగా, 121 మంది నామినేషన్లు దాఖలు చేశారు.  వైసీపీ తరఫున అన్ని వార్డులకు 63 మందితో నామినేషన్లు వేయించారు. టీడీపీ 7 వార్డులను వదిలేసి 18 వార్డుల్లో 25 మంది, బీజేపీ 10 వార్డులకు 16, జనసేన 3 నామినేషన్లు వేశారు. ఇప్ప‌టికే 43 మంది ఉపసంహరించుకున్నట్లు మున్సిప‌ల్ కమిషనర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుగురు, వైసీపీ నుంచి 26 మంది,  బీజేపీ నలుగురు, కాంగ్రెస్ నుంచి ఒక‌రు,  బీఎస్పీ నుంచి ఒక‌రు,  సీపీఐ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ఎంత‌మేర‌కు రాజీచర్చ‌లు ఫ‌లించి వైసీపీ త‌న ప్రాబ‌ల్యం నిరూపించుకుంటుందో చూడాలి!!.






ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !

కరోనా టైమ్‌లోనూ అంబానీ, అదానీ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>