MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-anushka-shetty5af7e781-3209-4af1-ad13-5749da0d36f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-anushka-shetty5af7e781-3209-4af1-ad13-5749da0d36f1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ కథానాయికలలో ఒకరైన అనుష్క శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫుల్ సినిమా అరుంధతి కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యాంప్రసాద్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో తనదైన ఆకట్టుకునే పర్ఫామెన్స్ తో అనుష్క అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా అనుష్కకు గొప్ప పేరు రావడంతో పాటు తెలుగు సహా పలు ఇతర భాషల్లో అవకాశాలsamantha akkineni;anushka shetty;naga chaitanya;anoushka;anushka;gautham new;gautham;gautham menon;gunasekhar;kodi ramakrishna;maya;ramakrishna;samantha;india;tollywood;cinema;hollywood;audience;blockbuster hit;heroine;success;mallemala entertainments;arundhati;amarnath k menonఅనుష్క కి అరుంధతి ఎలాగో ... సమంత కు ఈ మూవీ అలాగట ....??అనుష్క కి అరుంధతి ఎలాగో ... సమంత కు ఈ మూవీ అలాగట ....??samantha akkineni;anushka shetty;naga chaitanya;anoushka;anushka;gautham new;gautham;gautham menon;gunasekhar;kodi ramakrishna;maya;ramakrishna;samantha;india;tollywood;cinema;hollywood;audience;blockbuster hit;heroine;success;mallemala entertainments;arundhati;amarnath k menonWed, 03 Mar 2021 21:27:43 GMTటాలీవుడ్ స్టార్ కథానాయికలలో ఒకరైన అనుష్క శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫుల్ సినిమా అరుంధతి కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యాంప్రసాద్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో తనదైన ఆకట్టుకునే పర్ఫామెన్స్ తో అనుష్క అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా అనుష్కకు గొప్ప పేరు రావడంతో పాటు తెలుగు సహా పలు ఇతర భాషల్లో అవకాశాలు విరివిగా వచ్చాయి.

ఆ తర్వాత నుంచి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని విజయాలుగా మార్చుకుని కొనసాగుతున్నారు అనుష్క. ఇక ప్రస్తుతం అనుష్కతో పాటు స్టార్ నటిగా కొనసాగుతున్న మరొక హీరోయిన్ సమంత. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన సమంత ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళుతున్నారు.

ఇక లేటెస్ట్ గా ప్రఖ్యాత దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతం ఆదిపర్వం లోని కథగా శకుంతల, దుష్యంతుల ప్రేమకథగా ఆకట్టుకునే కథాకథనాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా దర్శకుడు గుణశేఖర్ ఈ మూవీని ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా నిర్మితం కానున్న ఈ సినిమాలో సమంత పాత్ర ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయిస్తుండడంతో పాటు భారీ వ్యయంతో సెట్స్ కూడా రూపొందిస్తున్నారట. అలానే పలువురు హాలీవుడ్ నిపుణులు ఈ మూవీకి పని చేయనున్నారని ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకోవడం తోపాటు నటిగా సమంతకు మరింత గొప్ప క్రేజ్ తెచ్చిపెడుతుందని సమాచారం. ఒక రకంగా అనుష్క కెరీర్లో అరుంధతి మూవీ ఎటువంటిదో ఈ సినిమా ఆ విధంగా సమంత కెరీర్లో నిలిచిపోతుందని టాక్......!!


పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>