MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruti74d84480-5956-4b9a-a3ba-b381d96cd476-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruti74d84480-5956-4b9a-a3ba-b381d96cd476-415x250-IndiaHerald.jpgఉప్పెన.. ఈ పేరు తలచుకుంటేనే టాలీవుడ్ కి ఉప్పెన లాంటి సంతోషం కలుగుతోంది. ఎందుకంటే కరోనా తరువాత కోట్లు మూటకట్టి మరీ టాలీవుడ్ ఖజానాను నింపిన మూవీ కాబట్టి. ఇక అంతే కాదు, మెఫా ఫ్యామిలీ నుంచి ఒక ఎనర్జిటిక్ స్టార్ ని ఇండస్ట్రీకి అందించింది. అలాగే గ్లామర్ కోసం అల్లల్లాడుతున్న టాలీవుడ్ కి కృతి శెట్టి రూపంలో ఒక అందగత్తెను ఇచ్చింది. kruti;beauty;ram pothineni;sudigali sudheer;tollywood;cinema;girl;heroine;romantic;sai pallaviఉప్పెన బ్యూటీ అక్కడ పోటీ...?ఉప్పెన బ్యూటీ అక్కడ పోటీ...?kruti;beauty;ram pothineni;sudigali sudheer;tollywood;cinema;girl;heroine;romantic;sai pallaviWed, 03 Mar 2021 11:00:00 GMTటాలీవుడ్ కి ఉప్పెన లాంటి సంతోషం కలుగుతోంది. ఎందుకంటే కరోనా తరువాత కోట్లు మూటకట్టి మరీ టాలీవుడ్ ఖజానాను నింపిన మూవీ కాబట్టి. ఇక అంతే కాదు, మెఫా ఫ్యామిలీ నుంచి ఒక ఎనర్జిటిక్ స్టార్ ని ఇండస్ట్రీకి అందించింది. అలాగే గ్లామర్ కోసం అల్లల్లాడుతున్న టాలీవుడ్ కి కృతి శెట్టి రూపంలో ఒక అందగత్తెను ఇచ్చింది.

అలాగే టాలెంటెడ్ డైరెక్టర్స్ తగ్గిపోతున్న నేపధ్యంలో సానా బుచ్చిబాబు అనే న్యూ టాలెంట్ ని కూడా అందించింది. మరి ఇన్ని విధాలుగా ఇచ్చిన ఉప్పెన గురించి ఇపుడు ఏ ఇద్దరు సినీ ప్రముఖులు కలసినా చర్చించుకోవడం  సర్వ సాధారణంగా ఉంది. ఇక ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వరసపెట్టి ఆఫర్లను అందుకుంటోంది. ఆమె ఇమ్మీడియెట్ గా చేస్తున్న మూవీస్ రెండు ఉంటే కొత్తగా సుధీర్ బాబు మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అలాగే రామ్ పోతినేని హీరోగా లింగు స్వామి డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

ఇక సుధీర్ బాబు తో ఇంద్రగంటి మోహన క్రిష్ణ మూవీ ఈ తీస్తున్నారు. ఇంద్రగంటి డైరెక్షన్ లో సుధీర్ నటించిన గత సినిమాల కంటే భిన్నంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ మూవీకి  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ మూవీ అని తెలుస్తోంది.

హీరోయిన్  నటన‌కి ఎక్కువ స్కోప్ ఉన్న ఈ మూవీలో కృతి శెట్టి నటించడం అంటే జాక్ పాట్ కొట్టేసినట్లే అంటున్నారు. ఈ మూవీలో కృతి తెలంగాణా యాసలో మాట్లాడుతుందిట. ఆమె ఆ భాష మాట్లాడితే కనుక మనకు ఠక్కుగ గుర్తుకు వచ్చే మరో హీరోయిన్ సాయి పల్లవి. మరి ఆమెకు కృతి శెట్టి పోటీయా అన్న చర్చ కూడా వస్తోంది. ఈ మూవీలో తెలంగాణా యాసతో కనుక కృతి అదరగొడితే సాయిపల్లవి కి గట్టి ప్రత్యర్ధి వచ్చేసినట్లే అంటున్నారు. చూడాలి మరి కృతి పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో ఏ లెవెల్ లో ఉంటుందో.




పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన శ్రియ.. ఒక్క క్షణం ఆగి ఉంటే..

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?

పురపోరు: పలాసలో క్యాంపు రాజకీయాలు.. టీడీపీకి పరువు దక్కేనా..?

పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న చైనా హ్యాకింగ్‌ టీమ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>