PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani2018b40a-5ad0-4670-acb7-1f4b6c9fb231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani2018b40a-5ad0-4670-acb7-1f4b6c9fb231-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కొంత మంది సైలెంట్ కావడం పట్ల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది మంత్రులు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వారు. కానీ ఇప్పుడు మొన్నటివరకు మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కనీసం మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. గుడివాడ నుంచి విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి నాని మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేయడంలేదు. మొన్నటివరకు మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎందుకు కనబడటంలేదు kodali nani;nani;kodali nani;telugu desam party;amarnath cave temple;andhra pradesh;telugu;government;panchayati;minister;local language;ycp;party;mantraకొడాలి నానీ ఎందుకు సైలెంట్ అయినట్టు...?కొడాలి నానీ ఎందుకు సైలెంట్ అయినట్టు...?kodali nani;nani;kodali nani;telugu desam party;amarnath cave temple;andhra pradesh;telugu;government;panchayati;minister;local language;ycp;party;mantraWed, 03 Mar 2021 09:10:58 GMTఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కొంత మంది సైలెంట్ కావడం పట్ల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది మంత్రులు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వారు. కానీ ఇప్పుడు మొన్నటివరకు మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కనీసం మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. గుడివాడ నుంచి విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి నాని మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేయడంలేదు.

మొన్నటివరకు మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎందుకు కనబడటంలేదు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపించడం తోనే ఆయన సైలెంట్ అయ్యారు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. కొడాలి నాని విషయంలో వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఉందని కొంతమంది అంటున్నారు. ఎందుకు ఏంటి అనేది తెలియక పోయినా ఆయన మంత్రి అయిన తర్వాత నియోజకవర్గం మీద దృష్టి పెట్టలేదు.

అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది అని వైసిపి అధిష్టానం భావిస్తోంది. మరి దీని వెనుక కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియదు గానీ... కొడాలి నాని మాత్రం ఇప్పుడు కాస్త ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. మొన్నటి వరకు ఆయన చేసిన విమర్శల కారణంగానే తన నియోజకవర్గంలో పార్టీ ఓటమి పాలయింది అనే వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో వినపడుతున్నాయి. అందుకే ఇప్పుడు నోటిదురుసు వ్యాఖ్యలు చేయవద్దు అనే భావనలో కొడాలి నాని ఉన్నారట. మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇబ్బంది పెడతాయి అనే భావనలో ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి గుడివాడ వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరి కొడాలి నాని ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ఆయనకే తెలియాలి.


పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>