PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddyf9e5313d-e992-4e71-9ef1-98cf26bf2b09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddyf9e5313d-e992-4e71-9ef1-98cf26bf2b09-415x250-IndiaHerald.jpgరైతుబంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసి.. స‌ర్కార్ సొమ్ముతో ఓట్లు కొన్న టీఆర్ఎస్ పార్టీకి పొయే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని కోమటిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని భావించి ఓటుకు ఎంతైనా పెట్టి కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. komatireddy;kcr;venkat;telangana rashtra samithi trs;congress;mp;chief minister;assembly;population;reddyపోయే రోజులు దగ్గర పడ్డాయి! ఎంపీ కోమటిరెడ్డి సంచలనంపోయే రోజులు దగ్గర పడ్డాయి! ఎంపీ కోమటిరెడ్డి సంచలనంkomatireddy;kcr;venkat;telangana rashtra samithi trs;congress;mp;chief minister;assembly;population;reddyWed, 03 Mar 2021 20:30:32 GMTముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.భార‌త రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో కేసీఆర్‌ను మించిన బ్రోక‌ర్, మోస‌గాడు లేడని మండిప‌డ్డారు. పీఆర్సీ 7శాతం అంటూ ఉద్యోగుల‌ను మోసం చేశారని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వ‌కుండా, నోటిఫికేష‌న్లు వేయ‌కుండా యువ‌త‌ను మోసం చేస్తున్న టీఆర్ఎస్ స‌ర్కార్‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ది చెప్పాలి కోరారు.

రైతుబంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసి.. స‌ర్కార్ సొమ్ముతో ఓట్లు కొన్న టీఆర్ఎస్ పార్టీకి పొయే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని కోమటిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని భావించి ఓటుకు ఎంతైనా పెట్టి కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ప్ర‌భావం రాష్ట్రంలోని 77 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌డుతుంద‌ని వివ‌రించారు. కాబ‌ట్టి విద్యావంతులు, మేధావులు టీఆర్ఎస్ ఓడిపోవ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ఓటును కాంగ్రెస్ వేయాలి కోరారు.

క‌మీష‌న్లు వ‌చ్చే ప‌నులే త‌ప్ప క‌మాన్ పీపుల్ ల‌బ్దిపొందే ఒక్క పని కేసీఆర్ చెయ్యలేద‌ని కాంగ్రెస్ ఆరోపించారు.  వాడేందుకు వీలుగా ఉన్న స‌చివాల‌యాన్ని వాస్తు పిచ్చితో కూల్చి రూ. వెయ్యి కోట్ల‌తో నూత‌న స‌చివాల‌యం క‌ట్టడం ఏంట‌ని వెంకట్ రెడ్డి ప్ర‌శ్నించారు. వ‌ర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని మాత్రం ఇప్పటి వ‌ర‌కు నిధులు మంజూరు చేయలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జావ‌స‌రాల‌కు కాకుండా కొడుకును సీఎం చేయాల‌నే కేసీఆర్ దృష్టి సారించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రానున్న ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయమ‌ని భావించిన క‌ల్వ‌కుంట్ల కుటుంబం.. రామేశ్వ‌ర్ రావుతో క‌లిసి హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ సర్కార్ వ‌చ్చిన త‌రువాత వీరి అవినీతి, భూక‌బ్జాల‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌న‌ని స్ప‌ష్టం చేశారు. అస‌లు ఉద్యోగ నోటిఫికేష‌న్లు వేసే ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌ని స‌ర్కార్ ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తుంద‌ని ఎలా న‌మ్ముతార‌ని ప్ర‌శ్నించారు. 


స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు.. త్వరపడండి..?

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>