PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-ycp-tdp-central-breaking-latest6fc7f394-8fba-49ee-b56c-877a0ba6fc43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-ycp-tdp-central-breaking-latest6fc7f394-8fba-49ee-b56c-877a0ba6fc43-415x250-IndiaHerald.jpgయువ‌తితో రాస‌లీల‌లు సాగించిన మంత్రి ఎట్ట‌కేల‌కు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఘ‌న‌త వ‌హించిన క‌ర్ణాట‌క బీజేపీ ప్ర‌భుత్వంలోని జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి ర‌మేశ్ జార్కిహొళి రాజీనామాపై గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్‌వాలా ఆమోదించారు. కేపీటీసీఎల్ లో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని యువ‌తిని లొంగ‌దీసుకున్న మంత్రి రాస‌లీల‌ల వీడియో నిన్న బ‌య‌ట ప్ర‌పంచానికి వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే.bjp, ycp, tdp, central, breaking, latest;bharatiya janata party;karnataka - bengaluru;రాజీనామా;loksabha;bengaluru 1;ministerరాస‌లీల‌ల మంత్రి రాజీనామారాస‌లీల‌ల మంత్రి రాజీనామాbjp, ycp, tdp, central, breaking, latest;bharatiya janata party;karnataka - bengaluru;రాజీనామా;loksabha;bengaluru 1;ministerWed, 03 Mar 2021 16:20:14 GMTమంత్రి ఎట్ట‌కేల‌కు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఘ‌న‌త వ‌హించిన క‌ర్ణాట‌క బీజేపీ ప్ర‌భుత్వంలోని జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి ర‌మేశ్ జార్కిహొళి రాజీనామాపై గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్‌వాలా ఆమోదించారు. కేపీటీసీఎల్ లో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని యువ‌తిని లొంగ‌దీసుకున్న మంత్రి రాస‌లీల‌ల వీడియో నిన్న బ‌య‌ట ప్ర‌పంచానికి వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే.

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంగళవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా రమేశ్ చెప్పినప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతుండటంతో బుధవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.  కేపీటీసీఎల్‌లో(కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి.. ఆమెతో రాసలీలలు జరిపిన విషయం తెలిసిందే. ఈ వీడియోను దినేశ్ కల‌హ‌ళ్లి అనే సామాజిక కార్యకర్త బెంగళూరులో మీడియాకు విడుదల చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల‌వ‌డంతోపాటు క‌ర్ణాట‌క‌లోని భార‌తీయ జ‌న‌తాపార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. త‌న‌ను, త‌న కుటుంబాన్ని ఇబ్బందుల‌కు గురిచేయ‌డానికే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల గిమ్మిక్కు వీడియో అంటూ మంత్రి ర‌మేశ్ ఆరోపించిన‌ప్ప‌టికీ ఆ వాద‌న నిల‌వ‌లేదు.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో మంత్రి రాస‌లీల‌ల వీడియో బాంబు ఒక్క‌సారిగా పేలింది.  ఈ వీడియోను ఎక్కడ, ఎవరు తీశారనేది స్పష్టత లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి త‌ర్వాత మోసం చేసినందుకు ప్రతీకారంగా బాధితురాలే ఈ  వీడియో తీయించి ఉంటుందని భావిస్తున్నారు. మరో కథనం ప్రకారం షార్ట్‌ ఫిల్మ్‌ తీసేందుకు మంత్రితో ఆమె సాన్నిహిత్యం పెంచుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని దినేశ్ కల‌హళ్లి బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కర్ణాటక శాసనసభ సమావేశాలు మరో రెండు రోజుల్లో మొదలవుతున్నాయి. అలాగే, రమేశ్‌ జార్కిహోళికి అడ్డాగా ఉండే  బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ తరుణంలో లీక్‌ అయిన శృంగార సీడీ వ్యవహారం రాజకీయరంగు పులుముకొంటోంది.


ఐసీసీ వరల్డ్ కప్ 2021 సూపర్ లీగ్ షెడ్యూల్ విడుదల..!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>