Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sriya-saran-got-escapped-an-accident-with-camel50a20a8d-2dd0-4577-8a1a-8b0bdb51daab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sriya-saran-got-escapped-an-accident-with-camel50a20a8d-2dd0-4577-8a1a-8b0bdb51daab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటి శ్రియ శరన్ ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏమాత్రం ఒక్క క్షణం ఆలస్యమై ఉన్నా ఇప్పటికి ఆసుపత్రిలో బెడ్‌పై తీవ్ర గాయాలతో ఉండేవారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి బయటపడడంతో శ్రియతో పాటు ఆమె అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. శ్రియ ప్రస్తుతం భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తోంది. తమ ట్రిప్‌కు సంబంధించి కొన్ని రొమాంటిక్ ఫోటోలను..sriya;shriya;ajay;niharika konidela;rajamouli;tennis;tollywood;rrr movie;cinema;marriage;husband;instagram;romantic;chitramపెద్ద ప్రమాదం నుంచి బయటపడిన శ్రియ.. ఒక్క క్షణం ఆగి ఉంటే..పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన శ్రియ.. ఒక్క క్షణం ఆగి ఉంటే..sriya;shriya;ajay;niharika konidela;rajamouli;tennis;tollywood;rrr movie;cinema;marriage;husband;instagram;romantic;chitramWed, 03 Mar 2021 11:42:00 GMTఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ నటి శ్రియ శరన్ ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏమాత్రం ఒక్క క్షణం ఆలస్యమై ఉన్నా ఇప్పటికి ఆసుపత్రిలో బెడ్‌పై తీవ్ర గాయాలతో ఉండేవారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి బయటపడడంతో శ్రియతో పాటు ఆమె అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. శ్రియ ప్రస్తుతం భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తోంది. తమ ట్రిప్‌కు సంబంధించి కొన్ని రొమాంటిక్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ట్రిప్‌లో భాగంగా పెరులో సరదాగా గడుపుతున్న శ్రియ అక్కడి కుజ్కోలోని ప్రఖ్యాతి గాంచిన మాచుపిచు ప్రాంతానికి వెళ్లింది. అక్కడే శ్రియ ఈ ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంది. దీనికి సంబంధించి ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

శ్రియ అక్కడే ఓపెన్ ప్లేస్‌లో కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తుండగా పక్కనే ఉన్న ఒక ఒంటె ఉన్నట్లుండి ఆమె వైపుకు దూసుకెళ్లింది. దీనిని గమనించి వెంటనే శ్రియ అక్కడ్నుంచి తప్పుకుంది. అది వచ్చిన వేగానికి శ్రియ క్షణం లేట్ చేసినా కచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగేది. ఒంటె దాడి నుంచి తృటిలో తప్పించుకున్న శ్రియ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘టేక్‌ మీ బ్యాక్‌’ అంటూ దానికి క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఇదిలా ఉంటే 2018లో శ్రియ రష్యాకు చెందిన అండ్రీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిహారిక వివాహం జరిగిన ఉదయ్‌పూర్‌ కోటలోనే వీళ్ల పెళ్లి కూడా జరిగింది. ఆండ్రీ బార్సిలోనాలో స్థిరపడిన మాజీ టెన్నిస్ ఆటగాడు. టాలీవుడ్‌లో 20 ఏళ్లకు పైగా శ్రియ నటిస్తోంది. అప్పుడెప్పుడో యిష్టం అంటూ 2001లో వచ్చిన శ్రియ.. ఇప్పటికీ తన సత్తా తగ్గలేదని నిరూపిస్తోంది. దర్శకులు కూడా శ్రియ కోసం కథలు రాస్తున్నారు. రాజమౌళి కూడా తన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ భార్యగా శ్రియను ఎంపిక చేశాడంటే ఇక ఆమె క్రేజ్ ఇప్పటికీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
">
">






ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?

పురపోరు: పలాసలో క్యాంపు రాజకీయాలు.. టీడీపీకి పరువు దక్కేనా..?

పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న చైనా హ్యాకింగ్‌ టీమ్..?

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>