Viralsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/yenugu-manavathvam-chanipoyina-kukka-nu-chusi-em-chesindo-chudandia1d10ded-8cd8-415f-ad57-34e3257003cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/yenugu-manavathvam-chanipoyina-kukka-nu-chusi-em-chesindo-chudandia1d10ded-8cd8-415f-ad57-34e3257003cd-415x250-IndiaHerald.jpg సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుమీద మూగజీవాలు చనిపోయి ఉండటం చూస్తాం. మనం స్పీడ్ గా డ్రైవింగ్ చేయడం వల్ల ఆ మూగజీవాలు రోడ్డు దాటుకునే క్రమంలో వాహనాల కిందపడి చనిపోతాయి. అయితే మనం చనిపోయిన ఆ మూగ జీవాల మీదే అలానే వాహనాలు నడుపుతూ ఉంటాం. మనుషులకు మాత్రమే కాదు మానవత్వం అనేది జంతువులకు కూడా ఉంటుంది అని ఈ ఏనుగు నిరూపించింది. అయితే మనసుతో ఆలోచించడం మనుషులకు మాత్రమే సాధ్యం అని అనుకునే వాళ్ళం. చెప్పాలి అంటే మనుషుల కంటే మంచి మనసు జంతువులకు కూడా ఉంటుంది. నమ్మ బుద్ధి కావడం లేదా? అయితే ఏనుగు ఏంచేyenugu;manu;sushanth;dogs;indianఏనుగు మానవత్వం చనిపోయిన కుక్క ను చూసి ఏం చేసిందో చూడండి..?ఏనుగు మానవత్వం చనిపోయిన కుక్క ను చూసి ఏం చేసిందో చూడండి..?yenugu;manu;sushanth;dogs;indianWed, 03 Mar 2021 23:00:00 GMT


 కొన్ని రోజుల  కిందట ఆకతాయిలు పైనాపిల్‌లో బాంబు పెట్టి  గర్భంతో ఉన్న ఏనుగు మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ మావటి ఏనుగును కట్టేసి దారుణంగా కొట్టాడు.అమాయక మూగ జీవులను అడవుల్లో వదలకుండా మన అవసరాలకు వాడుకోవడం ఏ మాత్రం సబబు కాదు. అలాంటి పనులు చేసేవాళ్లు అస్సలు మనుషులే కాదు. వారు కనీసం ఈ ఏనుగును చూసైనా బుద్ధి తెచ్చుకోవడం మేలు. మన మూగజీవాలను ప్రేమించక పోయినా పర్లేదు కానీ వాటికి హాని మాత్రం తల పెట్టకుండా ఉంటే చాలు.



ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్వీట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ మావటి ఓ ఏనుగుకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపిస్తున్నాడు. ఆ సమయంలో ఏనుగుకు రోడ్డు మీద చనిపోయిన కుక్క మృతదేహం కనిపించింది. దీంతో ఆ ఏనుగు.. దాని దాటి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లింది. అయితే, మనుషుల వాహనాలు మాత్రం ఆ కుక్క మృతదేహం మీద నుంచి వెళ్లడం గమనార్హం.



 సుశాంత్ నందా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.‘‘సంకెళ్లతో బందించినా మనసుతో ఆలోచించింది. వన్య మృగాలను సంకెళ్లు, బోనుల్లో బందించకుండా వదిలిపెట్టండి’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజనులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. వాహనాలు ఆ కుక్క మీద నుంచి వెళ్తున్నా.ఆ ఏనుగు మాత్రం ఆ కుక్క మీద నుంచి వెళ్లకుండా ఎంత గౌరవంగా పక్కకి తప్పుకుందో చూడండి అని అంటున్నారు. ఈ వీడియో చూసి మీరు కామెంట్స్ చేయండి.


ప్చ్ ..... పాపం ఈసారి ఆయన ఆశ నెరవేరేలా లేదట ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>