Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aavu-neyyi6c177693-8848-41ad-824c-497efc135e63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aavu-neyyi6c177693-8848-41ad-824c-497efc135e63-415x250-IndiaHerald.jpgహిందువులకు గోమాత ఎంతో పవిత్రమైనది. ఆవును పూజించడం ఆనవాయితి. అలాగే గోవు నుంచి లభించే ప్రతి ఒక్కటి అపురూపమే. గోమూత్రం నుంచి గోవు పాల వరకు అన్నింటిని ఉపయోగిస్తారు. అందుకే పూర్వం ఎక్కువగా ఆవు పాలు, పెరుగు, నెయ్యినే ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. aavu neyyi;vitamin a;vitamin;heart;cow slaughter;ghee;hindus;lieఆవు నెయ్యి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..?ఆవు నెయ్యి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..?aavu neyyi;vitamin a;vitamin;heart;cow slaughter;ghee;hindus;lieWed, 03 Mar 2021 06:00:00 GMT

 ఆవు నెయ్యి అంటేనే రుచికరం. ఇది చాలా రుచిగానేకాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆవు నెయ్యి అన్నింటి కంటే చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఏజెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.


గేదె నెయ్యి కాకుండా ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించండి. ఆవు నెయ్యి లో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు కె వంటి విటమిన్లు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ భోజనం లో కొంచెం నెయ్యి వేసుకోండి. దీంతో శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి. రెగ్యులర్ గా తక్కువ మోతాదు లో ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

ఆవు నెయ్య లో యాంటీ ఆక్సిడెంట్స్, లినోలిక్ యాసిడ్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడతాయి. కాబట్టి రెగ్యులర్ గా తీసుకుంటూ వుండండి. అంతే కాదండి ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల మగవాళ్ళల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాకుండా లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెమరీ పవర్ ని పెంచుకోవడానికి కూడా ఇది సహాయ పడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు రెగ్యులర్ గా ఆవు నెయ్యిని తీసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు.


పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>