CrimeGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-breaking-news-latest-newseace6ca1-b9b6-47b0-8032-c2d3209358fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime-breaking-news-latest-newseace6ca1-b9b6-47b0-8032-c2d3209358fa-415x250-IndiaHerald.jpg మాన‌వ సంబంధాలు మృగ్య‌మైపోతున్నాయి. కొడుకు వ‌య‌సున్న కుర్రాడితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఓ మ‌హిళ ఆ మోజులో ప‌డి భ‌ర్త‌నే హ‌త్య‌చేసింది. చివ‌ర‌కు క‌ట‌క‌టాల‌పాలైంది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగింది. దిండుగల్ జిల్లా పళని సమీపంలోని కీరనూర్ ప్రాంతంలో భార్యాభ‌ర్త‌లు దండ‌పాణి (37), దేవి (34) నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం తారాపురం వెళ్లి అక్క‌డ పండ్ల వ్యాపారం చేస్తారు. తిరిగి రాత్రికి ఇద్దరూ మళ్లీ కీరనూరు చేరుకుంటారు. crime, breaking news, latest news;abhishek;palani;district;police;february;husband;wife;police station;traffic police;red;katthiకొడుకు స్నేహితుడితో వివాహేత‌ర సంబంధం..కొడుకు స్నేహితుడితో వివాహేత‌ర సంబంధం..crime, breaking news, latest news;abhishek;palani;district;police;february;husband;wife;police station;traffic police;red;katthiWed, 03 Mar 2021 13:15:13 GMTజిల్లా పళని సమీపంలోని కీరనూర్ ప్రాంతంలో భార్యాభ‌ర్త‌లు దండ‌పాణి (37), దేవి (34) నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం తారాపురం వెళ్లి అక్క‌డ పండ్ల వ్యాపారం చేస్తారు. తిరిగి రాత్రికి  ఇద్దరూ మళ్లీ కీరనూరు చేరుకుంటారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు రాత్రి దేవి మాత్రమే తారాపురం నుంచి ఒంటరిగా కీరనూరుకు వెళ్లింది. దండపాణి ఎక్కడ అంటూ చుట్టుపక్కలవాళ్లు, బంధువులు ప్రశ్నించారు. పని మీద దిండుగల్ వెళ్లాడని, రెండు రోజుల తరువాత వ‌స్తాడ‌ని చెప్పింది.

రెండు రోజుల తరువాత దేవి కీరనూరు పోలీస్ స్టేషన్ చేరుకుని తన భర్త దండపాణి ఊరికి వెళ్లి వస్తానని చెప్పి  ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త కనపడలేదని ఫిర్యాదు చేసిన భార్య దేవి మీద మొదటి నుంచి పోలీసులకు అనుమానం ఉండేది. దండపాణి కోసం వెతకడం మానేసిన పోలీసులు దేవి మీద నిఘా వెయ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తారాపురం నుంచి నేరుగా కీరనూరులోని ఇంటికి వెళ్లకుండా కొడుకు స్నేహితుడైన అబిషేక్ ను క‌లిసి ఇంటికి వెళుతోంద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.  అస‌లు జ‌రిగిందేంటంటే..

పనిమీద బయటకు వెళుతున్నాన‌ని, ఇంటికి వెళ్లాలంటూ ఒక‌రోజు ష‌రా మాములుగానే దండ‌పాణి దేవికి చెప్పాడు.  భ‌ర్త ఊరెళుతున్నాడ‌ని పొర‌బ‌డిన దేవి ప్రియుడు అభిషేక్ ని  మార్గమధ్యంలో క‌లిసింది. అయితే దండ‌పాణి వీరిద్ద‌రినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని  అభిషేక్ ను చికతబాదేశాడు. ఆ సమయంలో గొడవ పెద్దద‌వుతోంద‌ని భావించిన దేవి భర్తను వెనుక నుంచి గట్టిగా పట్టుకోవ‌డంతో అభిషేక్ కత్తి తీసుకుని దండపాణిని ఇష్టం వచ్చిన‌ట్లు పొడిచేశాడు. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి దండ‌పాణి ముఖానికి కవర్ చుట్టే, శ‌వాన్ని పాడుపడిన బావిలో విసిరేసి చేతులు దులుపుకున్నారు. పోలీసు ద‌ర్యాప్తులో అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డం క‌ల‌క‌లం రేపింది.




నాలుగో టెస్ట్ లో కూడా పిచ్ అలాగే ఉంటుంది... అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>