Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi504d7033-0042-4401-9adc-46252be2a015-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi504d7033-0042-4401-9adc-46252be2a015-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల జోరు కొనసాగుతోంది. కుర్ర హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదన్నట్టుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సీనియర్ స్టార్స్. అయితే ఈ సీనియర్ స్టార్స్ నటిస్తున్న సినిమాల్లో ఆ ఒక్క విషయంలో డైరెక్టర్లు బాగా ఇబ్బందిపడుతున్నారట. ఈ హీరోల కోసం దర్శకులు తెగ కష్టపడిపోతున్నారట. మరి ఆ హీరోలు ఎవరనుకుంటున్నారు.. ఇంకెవరు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు, కింగ్ నాగార్జున, విక్టరి వెంకటేష్ లే. వీరితో సినిమాలు తీసేటప్పుడు ఆ డైరెక్టర్chiranjeevi;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;shiva;bhama;boyapati srinu;kajal aggarwal;koratala siva;pragya jaiswal;tara;bollywood;tollywood;cinema;king;director;lord siva;moon;king 1;heroine;nandamuri taraka rama rao;yashasvi jaiswal;massప్చ్.. సీనియర్ హీరోల కోసం దర్శకులకు ఈ కష్టాలు తప్పేలా లేవు పాపం..!ప్చ్.. సీనియర్ హీరోల కోసం దర్శకులకు ఈ కష్టాలు తప్పేలా లేవు పాపం..!chiranjeevi;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;shiva;bhama;boyapati srinu;kajal aggarwal;koratala siva;pragya jaiswal;tara;bollywood;tollywood;cinema;king;director;lord siva;moon;king 1;heroine;nandamuri taraka rama rao;yashasvi jaiswal;massWed, 03 Mar 2021 10:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల జోరు కొనసాగుతోంది. కుర్ర హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదన్నట్టుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సీనియర్ స్టార్స్. అయితే ఈ సీనియర్ స్టార్స్ నటిస్తున్న సినిమాల్లో ఆ ఒక్క విషయంలో డైరెక్టర్లు బాగా ఇబ్బందిపడుతున్నారట. ఈ హీరోల కోసం దర్శకులు తెగ  కష్టపడిపోతున్నారట. మరి ఆ హీరోలు ఎవరనుకుంటున్నారు.. ఇంకెవరు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు, కింగ్ నాగార్జున, విక్టరి వెంకటేష్ లే. వీరితో సినిమాలు తీసేటప్పుడు ఆ డైరెక్టర్లు పాపం ఆ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆ కష్టం ఏంటంటే.. ఈ హీరోలకు హీరోయిన్లను వెతికే విషయంలో డైరెక్టర్లు ఫెయిల్ అవుతున్నారట. ఈ స్టార్స్ కు అంతా వయసు మీద పడుతోంది.
అందులోనూ వారికి సరిజోడును తీసుకురావాలంటే రిస్క్ తో కూడుకున్న పనే అంటున్నారు డైరెక్టర్లు. ముందే ఈ హీరోలంతా వరుసగా సినిమాలను లైన్లో పెట్టేసారు. ఈ హీరోలు కూడా వారి వారి వయసుకు సెట్ అయ్యే స్టోరీస్ ను మాత్రమే ఎంపిక చేసుకున్నారు. అయితే కమర్షియల్ మూవీస్ కు అయితే కుర్ర హీరోయిన్లే అవసరమవుతారు. కాగా సీనియర్ హీరోలతో సినిమాలు ఓకే చేసుకున్న డైరెక్టర్లకు హీరోన్లు వెతికే సరికి తలప్రాణం తోకకు వస్తోందట పాపం. ఇప్పటికే నందమూరి నటసింహం బాలయ్య బాబు కోసం బోయపాటి నానా తంటాలు పడి ప్రగ్యా జైస్వాల్ ను ఒప్పించారట. ఇక ఆచార్య  కోసం కూడా కొరటాల శివ కూడా ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొన్నాడట. ఎలాగోలా చందమామ కాజల్ అగర్వాల్ ను సెట్ చేశాడు డైరెక్టర్.

ఇకపోతే కింగ్ నాగార్జున నటిస్తున ‘వైల్డ్ డాగ్’ మూవీలో హీరోయిన్ కోసం చాలా వెతికారట డైరెక్టర్. లాస్ట్ గా కింగ్ కు సెట్ చేసేందుకు బాలీవుడ్ భామ దియామిర్జాను ఓకే చేశారు. ఈ హీరోయిన్ ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించలేదు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ‘లూసీఫర్’ సినిమా కోసం ఇప్పుడు ఆ డైరెక్టర్ హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టాడట. అలాగే బాలయ్య కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని మాంచి మాస్ స్టోరీని కూడా రెడీ చేయించాడట. అంత బాగానే ఉన్నా.. బాలయ్యకు ఆ సినిమా కోసం హీరోయిన్ ను వెతకడమే కష్టంగా మారిందట. మొత్తానికి సీనియర్ స్టార్స్ కు హీరోయిన్లను వెతకడం కోసం డైరెక్టర్లు నానా తంటాలు పడాల్సి వస్తోందట. ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


మీది పొడి చర్మం మా.. అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి...?

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>