PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsde8cad21-0daa-4e89-9cc0-78553aa28cf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsde8cad21-0daa-4e89-9cc0-78553aa28cf8-415x250-IndiaHerald.jpgమున్సిపల్ ఎన్నికలలో కూడా ఏకగ్రీవాల జోరు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తారని భావించినా అలా జరగలేదు. కానీ భారీ ఎత్తున ఏకగ్రీవాలు మాత్రం నమోదయ్యాయి. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 222 ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. ఇందులోనూ దాదాపు సగం ఏకగ్రీవాలు సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోనే చొటు చోసుకోవడం మరో విశేషం... jagan-nimmagadda-elections;hari;hari music;jagan;district;kadapa;minister;pulivendula;ycp;partyపుర పోరు : కడపలో ఏకగ్రీవాల జోరు..పులివెందులలో క్లీన్ స్వీప్..పుర పోరు : కడపలో ఏకగ్రీవాల జోరు..పులివెందులలో క్లీన్ స్వీప్..jagan-nimmagadda-elections;hari;hari music;jagan;district;kadapa;minister;pulivendula;ycp;partyWed, 03 Mar 2021 15:00:00 GMTజగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోనే చొటు చోసుకోవడం మరో విశేషం...


పంచాయితీ ఎన్నికలలో ఎలా జరిగిందో ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా జరిగింది. జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.  గతేడాది కరోనా కారణంగా ఆగిపోయి తిరిగి నిన్న ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల పోరులో తొలిరోజే సంచలనాలు నమోదయ్యాయి.పులివెందుల పురపాలక సంఘంలో అయితే పరిస్ధితి చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ఏం జరగబోతోందో తొలిరోజు లెక్కలే చెప్పేశాయి. సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ పూర్తిస్ధాయిలో తమ హవా కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతుంది.


నిన్న నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఏకగ్రీవమైన వాటిలో సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలో అత్యధికం ఉన్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఒక్కరోజులోనే 100 ఏకగ్రీవాలు నమోదుకావడం విశేషం. అందులోనూ జగన్ నియోజకవర్గం పులివెందులలో అయితే అన్ని చోట్లా సింగిల్‌ నామినేషన్లే దాఖలు కావడం మరో విశేషం. దీంతో పులివెందుల మున్సిపాలిటీ రాష్ట్రంలో పూర్తి ఏకగ్రీవాలతో రికార్డు సృష్టించబోతోంది. మొత్తం మీద కడప జిల్లా మున్సిపల్‌ ఎన్నికల ఏకగ్రీవాల  జోరు మిగితా జిల్లాల కంటే కాస్త ముందుంది. తొలిరోజు 2472 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. గతంలో నామినేషన్లు వేసిన వీరంతా నిన్న ఒక్కరోజులోనే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు మిగిలి ఉండటంతో మరికొంత మంది నామినేషన్లు వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నారు. మిలిగిన అభ్యర్థుల లిస్ట్ ను సాయంత్రం ప్రకటించనున్నారు.


నిమ్మగడ్డను టార్గెట్ చేసిన టీడీపీ

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>