PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandrababu-election-campaign-focus-on-wealth-tax50634968-589a-4520-af3c-033d1af529b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandrababu-election-campaign-focus-on-wealth-tax50634968-589a-4520-af3c-033d1af529b8-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టినా, మున్సిపాల్టీల విషయంలో టీడీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. కార్యకర్తలు, నాయకుల ధీమా ఎలా ఉందో తెలియదు కానీ, చంద్రబాబు మాత్రం పురపాలికల్లో టీడీపీ జెండా ఎగరేస్తామంటూ గట్టిగా చెబుతున్నారు. ఇటీవలే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది టీడీపీ. ఇప్పుడు కొత్తగా ఆస్తి పన్ను తగ్గించే విషయంలో చంద్రబాబు మరో ప్రకటన ఇచ్చారు. టీడీపీ గెలిచిన పురపాలక, నగర పాలక సంస్థల్లో ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్‌ మొదటి సమావేశంలోనే తీర్మానిస్తామని చెప్పారు చంద్రబాబు. chandra babu;vijayawada;guntur;vishakapatnam;panchayati;tdp;ycp;april;partyపురపోరు: ఆస్తి పన్ను టీడీపీకి కలిసొస్తుందా..?పురపోరు: ఆస్తి పన్ను టీడీపీకి కలిసొస్తుందా..?chandra babu;vijayawada;guntur;vishakapatnam;panchayati;tdp;ycp;april;partyWed, 03 Mar 2021 11:00:00 GMTపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టినా, మున్సిపాల్టీల విషయంలో టీడీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. కార్యకర్తలు, నాయకుల ధీమా ఎలా ఉందో తెలియదు కానీ, చంద్రబాబు మాత్రం పురపాలికల్లో టీడీపీ జెండా ఎగరేస్తామంటూ గట్టిగా చెబుతున్నారు. ఇటీవలే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది టీడీపీ. ఇప్పుడు కొత్తగా ఆస్తి పన్ను తగ్గించే విషయంలో చంద్రబాబు మరో ప్రకటన ఇచ్చారు. టీడీపీ గెలిచిన పురపాలక, నగర పాలక సంస్థల్లో ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్‌ మొదటి సమావేశంలోనే తీర్మానిస్తామని చెప్పారు చంద్రబాబు.

ఏపీలోని పట్టణాలు, నగరాల్లో ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రలను అడ్డుకుంటామని అన్నారు చంద్రబాబు. పురపాలక ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే ప్రజలపై పెనుభారం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేస్తుండగా, రిజిస్ట్రేషన్‌ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా జగన్‌ చట్టం తీసుకొచ్చారని విమర్శించారు బాబు. రాష్ట్ర ప్రభుత్వం రుణ పరిమితి పెంచుకోవడానికి ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటని అన్నారాయన. గతంలో పన్ను వేయని భవనాలు, ఖాళీ స్థలాలకు కొత్త విధానంలో రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా పన్ను వేసేలా వైసీపీ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని విమర్శించారు చంద్రబాబు. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా రిజిస్టర్డ్‌ విలువ ఆధారంగా పన్ను చెల్లించేలా చట్టం తేవడం ప్రజలను వేధించడమేనని అన్నారు చంద్రబాబు.

ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఎక్కడలేని భారం మోపుతోందని అన్న చంద్రబాబు.. తమ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. తొలి కౌన్సిల్ లోనే ఆస్తి పన్ను తగ్గించేలా తీర్మానం చేపడతామన్నారు. ఇక పురపోరుకోసం ప్రచార రంగంలోకి దిగిన బాబు, ఈ నెల 4న కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, ఎనిమిదో తేదీన గుంటూరులో పర్యటించబోతున్నారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ రోడ్ షో లలో పాల్గొంటారు. 


ఏపీ సర్కార్ పై పోరులో వెనక్కు తగ్గిన ఎస్ఈసీ...?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>