Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/budidagummadikayab9b0cb37-e07b-4b3a-a200-9ed9e9fc9179-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/budidagummadikayab9b0cb37-e07b-4b3a-a200-9ed9e9fc9179-415x250-IndiaHerald.jpgగుమ్మడి కాయను శుభకార్యాలకు వాడుతూ ఉంటాము. గృహ ప్రవేశం చేసేటప్పుడు గుమ్మడి కాయను గుమ్మం పైన కడతారు. అంతేకాకుండా గుమ్మడికాయతో దిష్టి కూడా తీస్తారు. ఇలాంటి వాటికి కాకుండా ఆరోగ్యానికి కూడా గుమ్మడికాయ చాలా మంచిది. ఉమ్మడి కాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం... budidagummadikaya;gummadi;rasam;aqua;tuberculosis;indian gooseberryబూడిదగుమ్మడి కాయలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి... అవి ఇవే...?బూడిదగుమ్మడి కాయలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి... అవి ఇవే...?budidagummadikaya;gummadi;rasam;aqua;tuberculosis;indian gooseberryWed, 03 Mar 2021 07:00:00 GMTగుమ్మడి కాయను శుభకార్యాలకు వాడుతూ ఉంటాము. గృహ ప్రవేశం చేసేటప్పుడు గుమ్మడి కాయను గుమ్మం పైన కడతారు. అంతేకాకుండా గుమ్మడికాయతో దిష్టి  కూడా తీస్తారు. ఇలాంటి వాటికి కాకుండా ఆరోగ్యానికి కూడా గుమ్మడికాయ చాలా మంచిది. ఉమ్మడి కాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 గుమ్మడి కాయ తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి సహాయపడుతుంది.  అంతే కాకుండా మొలల వ్యాధి   తో బాధపడే వాళ్ళు గుమ్మడికాయ తీసుకోవడం వల్ల అలలు తగ్గడమే కాకుండా మూత్రం సాఫీగా అవుతుంది.

 మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వాళ్ళు గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా గుమ్మడి కాయ రసం తో పుండు మీద కట్టుకడితే పుండు  తొందరగా మారుతాయి.

 బూడిద గుమ్మడి కాయను బాగా దంచి రసం తీసుకోవాలి. ఈ రసంలో తేనె కలిపి  తాగడం వల్ల ఆడవారిలో బహిష్టు ఆగిపోయే ముందు వచ్చే చికాకు, శరీర వేడి, మూత్రంలో మంట, కాళ్ళు చేతులు మంటలు, ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. ఇలా రోజుకు రెండు మూడుసార్లు పదిహేను రోజులు తీసుకోవాలి.

 మూత్రంలో మంట, ముక్కునుండి రక్తం కారడం,  మూల వ్యాధి వంటివి ఉన్నప్పుడు నాలుగు చెంచాల గుమ్మడి రసంలో ఒక చెంచా ఉసిరి కాయ రసం, కొంచెం పటికబెల్లం వేసి తీసుకోవడం వల్ల పై సమస్యలు తగ్గుతాయి.

 కడుపులో పురుగులు ఉంటే బూడిద గుమ్మడి కాయ లోని విత్తనాలను పొడి చేసి అందులోకి కొబ్బరి పాలు కలిపి తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు బయటికి పోతాయి. అలాగే గుమ్మడి గింజల పొడితో కుంకుడుకాయ పొడి కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

 బూడిది గుమ్మడికాయ తీసుకోవడంవల్ల లివర్ వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా కామెర్ల వ్యాధిని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధులలో టీబీ వ్యాధి లోనూ నిసత్తువను  పోగొట్టడానికి ఉమ్మడి సహాయపడుతుంది.

 గుమ్మడికాయలో తేమ, కొవ్వు, పిండి పదార్థాలు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు గుమ్మడి కాయలు తినడం మంచిది.




పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>