MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/spbfd63087e-935a-4eb6-b5b1-b1d8188c73e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/spbfd63087e-935a-4eb6-b5b1-b1d8188c73e4-415x250-IndiaHerald.jpgశ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం. చిన్నపుడు ఇంట్లో వారూ, స్నేహితులు మణి అని పిలిచేవారు. ఇక సినిమా ఇండస్ట్రీకి, తెలుగు పాటల ప్రేమికులకు, కోట్లాది మంది అభిమానులకు ఆయన బాలు. తెలుగు వారికి బాలుడిగా స్థిరపడిపోయిన ఎస్పీ బాలూ డెబ్బయి నాలుగేళ్ళు జీవించారు. spb;geetha;cinema;sangeetha;television;september;silver;silver screen;prasthanamఇంటరెస్టింగ్ : బాలూ బయోపిక్...?ఇంటరెస్టింగ్ : బాలూ బయోపిక్...?spb;geetha;cinema;sangeetha;television;september;silver;silver screen;prasthanamWed, 03 Mar 2021 19:30:00 GMTసినిమా ఇండస్ట్రీకి, తెలుగు పాటల ప్రేమికులకు, కోట్లాది మంది అభిమానులకు ఆయన బాలు.  తెలుగు వారికి బాలుడిగా స్థిరపడిపోయిన ఎస్పీ బాలూ డెబ్బయి నాలుగేళ్ళు జీవించారు.

బతికి ఉన్నంతకాలం పాడుతూనే ఉన్నారు. ఆయన పాటల పూదోటలో విహరించని వారు ఎవరూ లేరు. బాలూ ఆరోగ్యంగానే ఉండేవారు. ఆయన ఇదే తీరున జోరు చూపిస్తే మరో పదేళ్ల పాటు ఇలాగే పాటలు పాడుతూ టీవీ షోలు చేస్తూ ఉంటారని అంతా ఆశించారు. కానీ ఎక్కడి కరోనా, కరుణ లేని కరొనా బాలూని తీసుకుపోయింది. గత ఏడాది సెప్టెంబర్ 25న బాలూ ఈ లోకాన్ని వీడివెళ్ళిపోయారు. బాలూ లేని సినీ సంగీతాన్ని ఇప్పటికీ అభిమానులు అసలు ఊహించలేరు. కానీ విధి రాత వేరుగా ఉంది. కఠినంగా ఉంది. దాంతో బాలూ భౌతికంగా అందరికీ దూరం కావాల్సివచ్చింది. బాలూ అంటే నిలువెత్తు తెలుగు పాట. ఆ మాటలు వస్తే భార‌తీయ పాట అని కూడా చెప్పాలి.

బాలూ తన యాభై అయిదేళ్ళ సినీ సంగీత ప్రస్థానంలో ఎన్నో ఎత్తులు చూశారు. ఆయన‌ నలభై వేల పై చిలుకు పాటలు పాడి అందరినీ అలరింపచేశారు. బాలూ కీర్తిని శాశ్వతం చేస్తూ ఆయనను సెల్యూలాయిడ్ మీద అందంగా చరిత్రలో తీపి గురుతుగా నిలిచిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలూ బయోపిక్ కోసం సన్నాహాలు తెర వెనక సాగుతున్నాయట. బాలూ కుటుంబ సభ్యులు కనుక అంగీకరిస్తే వెండి తెర మీద బాలూ మొత్తం జీవితాన్ని చూసేయవచ్చు. అలా కళ్ళకు కట్టేసుకోవచ్చు. బాలూ అంటే తెలుగు సినిమా లోకమే కాదు భారతీయ భాషలన్నింటా పాటలు పాడారు. ఎందరో ఉద్ధండుల నుంచి ఆయనకు అయిదు తరాలకు పైగా పరిచయాలు ఉన్నాయి. దాంతో బాలూ తో పాటే వారిని కూడా వెండి తెర మీద చూసే భాగ్యం కూడా కలుగుతుంది అని అంటున్నారు.







చరణ్ తో గౌతమ్ మూవీ ఫిక్స్ .... పండుగ రోజు ప్రకటన ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>