BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/neck-mudathalu11997a7c-eda4-473c-9df1-f651365431fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/neck-mudathalu11997a7c-eda4-473c-9df1-f651365431fa-415x250-IndiaHerald.jpgవయసు పెరుగుతున్న కొద్దీ ముఖం మీద ముడతలు రావడం సహజం.. మరీ చిన్న వయసుకే ముఖంతో పాటు మెడ మీద కూడా ముడతలు వచ్చి చూడడానికి అసహ్యకరంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మెడచుట్టు బాగా నల్లగా మారిపోయి, ఏదో వికారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ, ఎన్నో ఉత్పత్తులను వాడినప్పటికీ,ప్రయోజనం లేక విసుగు చెంది ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకువచ్చాము కొన్ని చిట్కాలను. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. neck,mudathalu;apple;rasam;oil;green teaమెడమీద ముడతలు చూడ్డానికి అసహ్యకరంగా ఉన్నాయా..!మెడమీద ముడతలు చూడ్డానికి అసహ్యకరంగా ఉన్నాయా..!neck,mudathalu;apple;rasam;oil;green teaWed, 03 Mar 2021 07:00:00 GMTవయసు పెరుగుతున్న కొద్దీ ముఖం మీద ముడతలు రావడం సహజం.. మరీ చిన్న వయసుకే ముఖంతో పాటు మెడ మీద కూడా ముడతలు వచ్చి చూడడానికి అసహ్యకరంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మెడచుట్టు బాగా నల్లగా మారిపోయి, ఏదో వికారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ, ఎన్నో ఉత్పత్తులను వాడినప్పటికీ,ప్రయోజనం లేక విసుగు చెంది ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకువచ్చాము కొన్ని చిట్కాలను. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్ లో ముంచిన కాటన్ బాల్ తో మెడను తుడిచి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ రసంలో,  ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. మిశ్రమాన్ని మెడకు పట్టించి,నెమ్మదిగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.  ఉదయం చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు , నెలకు మూడు వారాలపాటు  చేయడం వల్ల మెడ మీద నలుపు తగ్గుతుంది. అలాగే ముడతలు కూడా నెమ్మదిగా తగ్గుతాయి.


ఆపిల్ వెనిగర్ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.  కీరదోస రసం చర్మాన్ని కోమలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వీలైనప్పుడల్లా కనీసం రోజుకు ఒకసారి, ఐస్ క్యూబ్ తో మెడ మీద సున్నితంగా మర్ధనా చేయడం వల్ల క్రమంగా మెడమీద ముడతలు తగ్గి పోయే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా గ్రీన్ టీ బ్యాగులను నీటిలో అద్ది, ఆ నీటిలో ఒక కాటన్ బాల్ ఉంచి, దానిని మెడ మీద రుద్దడం వల్ల క్రమంగా నలుపు తగ్గి, చర్మం బిగుతువుగా మారుతుంది.

అలాగే ప్రతిరోజు ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనె రాస్తూ ఉంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇక చలికాలంలో చేతులకు ఆయిల్ తో మర్దనా చేయడం వల్ల ముడతలు తగ్గి, చేతి వేళ్లు కూడా అందంగా తయారవుతాయి.




పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>