Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iliana3d508574-7217-4ed6-9a17-c120c4b66c6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iliana3d508574-7217-4ed6-9a17-c120c4b66c6d-415x250-IndiaHerald.jpgదేవదాసు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకో లేదన్న విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కొత్త తరహా అందాలను పరిచయం చేసి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా తన నడుము అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ సొగసరి. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఎన్నో రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించింది. ఆ తర్Iliana;charlie;bollywood;tollywood;media;blockbuster hit;heroine;dogs;andrew neebone;ileana d'cruzతన కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన ఇలియానా.. ఎవరో తెలుసా..?తన కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన ఇలియానా.. ఎవరో తెలుసా..?Iliana;charlie;bollywood;tollywood;media;blockbuster hit;heroine;dogs;andrew neebone;ileana d'cruzWed, 03 Mar 2021 20:30:00 GMTదేవదాసు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకో లేదన్న విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కొత్త తరహా అందాలను పరిచయం చేసి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా తన నడుము అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ సొగసరి.  ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను  తన ఖాతాలో వేసుకుని ఎన్నో రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించింది.


 ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన లక్ పరీక్షించుకోవాలని అటువైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ  అక్కడ మాత్రం విజయం సాధించలేకపోయింది అనే విషయం తెలిసిందేకాగా  అదే సమయంలో విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ లో కూడా మునిగితేలుతూ ఇక ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇక బ్రేకప్ చెప్పిన తర్వాత కొన్ని రోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్ళిన ఇలియానా ఇక ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెడుతున్నాను అని సోషల్  మీడియా వేదికగా చెప్పింది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.


ఇటీవలే  అభిమానులతో ముచ్చటించిన ఇలియానా తన కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు ఏమిటో సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో మీ కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు ఏమిటి అని అభిమాని ప్రశ్నించగా..  తన పెంపుడు కుక్క ని చూపించింది ఈ అమ్మడు. వీడు చార్లీ వీడే  నా బాయ్ ఫ్రెండ్ అంటూ  సమాధానం ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఇలియానా ఒకప్పటి సన్నజాజిలా కాకుండా బొండుమల్లెలా  మారిపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్త అవకాశాలు తగ్గాయి అనే విషయం తెలిసిందే. రవితేజతో కలిసి రీ ఎంట్రీ  ఇచ్చినప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఈ క్రమంలోనే మళ్ళీ బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది.



అనుష్క కి అరుంధతి ఎలాగో ... సమంత కు ఈ మూవీ అలాగట ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>