PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp6c9b09a0-48b7-4568-b7b9-1a3034ff1fed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp6c9b09a0-48b7-4568-b7b9-1a3034ff1fed-415x250-IndiaHerald.jpgఇక ఎమ్మెల్సీ గోవింద‌రెడ్డికి ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కం కానున్నాయి. ఆయ‌న రెబల్స్ ను బుజ్జ‌గించేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఎవ్వరూ పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నట్లు వైసీపీలో చర్చ సాగుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటున్నా ధిక్కరణ ధోరణిలోనే ఉన్నట్లు సమాచారం. అయితే రెబ‌ల్స్ వాద‌న మ‌రోలా ఉంది. పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డిన వారికి కాకుండా కొత్త‌గా పార్టీలో చేరిన వారికి చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని.. అలాంటప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి క‌ష్ట‌ప‌డిన వారి సంగ‌తేంట‌ని ysrcp;govinda;govi;andhra pradesh;district;mla;letter;local language;ycp;reddy;partyపుర పోరు: క‌డ‌పలో ఆ మున్సిపాల్టీ వైసీపీకి క‌ష్టమేనా.. రెబెల్స్ దెబ్బ త‌ప్పదా ?పుర పోరు: క‌డ‌పలో ఆ మున్సిపాల్టీ వైసీపీకి క‌ష్టమేనా.. రెబెల్స్ దెబ్బ త‌ప్పదా ?ysrcp;govinda;govi;andhra pradesh;district;mla;letter;local language;ycp;reddy;partyWed, 03 Mar 2021 13:51:59 GMTఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అధికార వైసీపీలో రెబెల్స్ మోగిస్తున్నారు. క‌డ‌ప జిల్లాలో ఒక‌టి అయిన బ‌ద్వేల్ మున్సిపాల్టీలో 35 వార్డుల‌కు వైసీపీ నుంచే ఏకంగా 90 మంది నామినేష‌న్లు వేశారు. వీరిలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి 35 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారు. మ‌రి కొంద‌రు బీ ఫామ్‌లు ఇవ్వ‌క‌పోయినా స్వ‌తంత్య్రులుగా బ‌రిలో ఉంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో  రెబల్స్ ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు.

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోని మున్సిపాల్టీ కావ‌డంతో ఈ ఎన్నిక‌ల‌ను జిల్లా వైసీపీ కీల‌క నేత‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇక ఎమ్మెల్సీ గోవింద‌రెడ్డికి ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కం కానున్నాయి. ఆయ‌న రెబల్స్ ను బుజ్జ‌గించేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఎవ్వరూ పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నట్లు వైసీపీలో చర్చ సాగుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటున్నా ధిక్కరణ ధోరణిలోనే ఉన్నట్లు సమాచారం.

అయితే రెబ‌ల్స్ వాద‌న మ‌రోలా ఉంది. పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డిన వారికి కాకుండా కొత్త‌గా పార్టీలో చేరిన వారికి చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని.. అలాంటప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి క‌ష్ట‌ప‌డిన వారి సంగ‌తేంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. రెబ‌ల్స్ నామినేష‌న్లు తీసేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇక్కడ వైసీపీకి గెలుపు కష్టంగా మారింది. ఇప్ప‌టికే జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పులివెందుల‌లో అన్ని వార్డులు వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి.

రేపు బ‌ద్వేల్ రిజ‌ల్ట్ తేడా వ‌స్తే స్థానిక నేత‌లు జ‌గ‌న్ ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌దు. మ‌రీ బ‌ద్వేల్లో ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య రెబ‌ల్స్ ను ఎలా దారి లోకి తెచ్చుకుంటారో ?  చూడాలి.





విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>