PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/police-arrest-fake-notes-suppliers26b0d2aa-6911-456c-9af4-ad4e22805ada-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/police-arrest-fake-notes-suppliers26b0d2aa-6911-456c-9af4-ad4e22805ada-415x250-IndiaHerald.jpgపెద్ద నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీ తగ్గిపోతుందనే భావనతోపాటు, నకిలీ కరెన్సీ బెడద కూడా తగ్గిపోతుందని అనుకున్నారంతా. కానీ పాత నోట్ల కంటే, కొత్త నోట్ల ప్రింటింగ్ విషయంలోనే అక్రమార్కులు తెలివి మీరిపోయారనే విషయం అప్పుడప్పుడూ బయటపడుతోంది. తాజాగా ఒడిశాలో నకిలీ నోట్లు చలామణికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. fake notes;visakhapatnam;siliguri;rbi;district;vishakapatnam;police;bus;car;arrest;customer;currency;raipurనకిలీ నోట్లతో భయం భయం..నకిలీ నోట్లతో భయం భయం..fake notes;visakhapatnam;siliguri;rbi;district;vishakapatnam;police;bus;car;arrest;customer;currency;raipurWed, 03 Mar 2021 09:00:00 GMTకరెన్సీ బెడద కూడా తగ్గిపోతుందని అనుకున్నారంతా. కానీ పాత నోట్ల కంటే, కొత్త నోట్ల ప్రింటింగ్ విషయంలోనే అక్రమార్కులు తెలివి మీరిపోయారనే విషయం అప్పుడప్పుడూ బయటపడుతోంది. తాజాగా ఒడిశాలో నకిలీ నోట్లు చలామణికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వాహనాల తనిఖీ సమయంలో వీటిని గుర్తించామని కోరాపుట్‌ ఎస్పీ తెలిపారు. నకిలీ నోట్లు తరలిస్తున్న కారుకు ఛత్తీస్‌ గఢ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉందని, రూ.500 డినామినేషన్ ఉన్న నోట్లను పెద్ద సంచుల్లో తరలిస్తున్నారని తెలిపారు. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇలాగే నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు. కోల్‌కతా సరిహద్దు బంగ్లాదేశ్‌ వద్ద ఉన్న సిలిగురి ప్రాంతం నుంచి నకిలీ నోట్లు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నకిలీ నోట్లను సరఫరా చేసుకోవడం కోసం కొందరు ముఠాగా ఏర్పడినట్టు.. సిలిగురి వెళ్లి అక్కడి నుంచి రైళ్లు, బస్సులు, అవసరమైతే లారీల్లో కూడా సూట్‌కేసులలో దుస్తుల కింద అమర్చి నకిలీ నోట్లను తీసుకొస్తున్నట్లు సమాచారం ఉంది. ఎక్కువగా రూ.100, రూ.500 నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏటీఎంలలో నకిలీ నోట్లు వస్తే ఏంచేయాలి..?
ఇటీవలి కాలంలో నేరుగా నకిలీ నోట్లు ఏటీఎంలలో కూడా వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు.  ఖాతాదారులకు ఏటీఎం ద్వారా నకిలీ నోట్లు వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. అక్కడ పట్టించుకోకపోతే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. డ్రా చేసిన రశీదును దగ్గర పెట్టుకోవాలి. నకిలీ నోట్లు నంబర్‌ ను స్కాన్‌ చేసినప్పుడు తెలిసిపోతుంది. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 


పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>