PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కె.శివరాజశేఖరరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా శివరాజశేఖరరెడ్డి తరపున న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారుap high court;cbn;hari;hari music;praveen;telugu desam party;andhra pradesh;janasena;high court;telugu;panchayati;court;lawyer;tdp;ycp;janasena party;partyచంద్రబాబు కేసులో హైకోర్టు గుస్సా!చంద్రబాబు కేసులో హైకోర్టు గుస్సా!ap high court;cbn;hari;hari music;praveen;telugu desam party;andhra pradesh;janasena;high court;telugu;panchayati;court;lawyer;tdp;ycp;janasena party;partyTue, 02 Mar 2021 09:48:15 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పార్టీల మధ్య పంచాయితీ మాత్రం ఆగడం లేదు. పార్టీ గుర్తలకు సంబంధం లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికలపై పార్టీలో న్యాయస్థానాల్లో పోరాడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంపై నమోదైన కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మానసం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ  మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కె.శివరాజశేఖరరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా శివరాజశేఖరరెడ్డి తరపున న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని టీడీపీని ఎస్‌ఈసీ సూచించింది తప్పితే ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

కేసు విచారణలో భాగంగా స్పందించిన న్యాయస్థానం పార్టీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో విడుదల చేస్తే అధినేతపై చర్యలు కోరడం ఏంటని ప్రశ్నించింది. చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిల్‌కు విచారణార్హత లేదంటూ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

   ఆంధ్రప్రదేశ్ లోని 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9, 14, 17. 21 తేదీల్లో పోలింగ్ జరగగా.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపుపైనా పార్టీల మధ్య యుద్ధం నడిచింది. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 80 శాతానికి పైగా పంచాయతీల్లో గెలిచారని వైసీపీ ప్రకటించుకోగా.. 42 శాతం మంది తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారని టీడీపీ తెలిపింది. జనసేన కూడా తాము 25 శాతం ఓట్లు సాధించామని వెల్లడించింది.దీంతో అధికార పార్టీ తమ పార్టీ మద్దతుతో  గెలిచిన  అభ్యర్థుల వివరాలతో వెబ్ సైట్ రూపొందించింది. అయితే టీడీపీ మాత్రం తమ మద్దతుతో గెలిచిన వారిని.. వైసీపీ బెదిరించి తమ పార్టీలో చేర్చుకుందని ఆరోపిస్తోంది.









పుర పోరు: చిత్తూరులో నామినేషన్ల ఉపసంహరణ కు వేళాయే..

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?

పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !

డేంజర్ జోన్ లో ఏపీ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా..

పుర పోరు : అనంత నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ హై కమాండ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>