MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/venkateshc3398af9-4d56-47ea-8a6a-f70386564b85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/venkateshc3398af9-4d56-47ea-8a6a-f70386564b85-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే అయన సినిమాలు ఇటీవలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు.. కథల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తన వయస్సు కి తగ్గ పాత్రలున్న సినిమాలే ఎంచుకుంటున్నా ఎందుకో ఆ సినిమాలు పెద్దగా ఆడట్లేదు.. రొటీన్ పాత్రలు చేస్తూ వెంకీ బోర్ కొట్టిస్తున్నాడని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఆయనకు F2 తప్పా కమర్షియల్ హిట్ ఏదీ లేదంటే ఆశ్చర్యపోవచ్చు.. venkatesh;venkatesh;anil music;anil ravipudi;bhaskar;tarun;audi;tollywood;cinema;baba bhaskar;tamil;asuran;marriage;f2;august;remake;director;lie;wanted;tarun kumar;narappaఇప్పటికైనా కనికరించేనా.. వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా ఏమైంది..?ఇప్పటికైనా కనికరించేనా.. వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా ఏమైంది..?venkatesh;venkatesh;anil music;anil ravipudi;bhaskar;tarun;audi;tollywood;cinema;baba bhaskar;tamil;asuran;marriage;f2;august;remake;director;lie;wanted;tarun kumar;narappaTue, 02 Mar 2021 07:00:00 GMTటాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే అయన సినిమాలు ఇటీవలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు.. కథల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తన వయస్సు కి తగ్గ పాత్రలున్న సినిమాలే ఎంచుకుంటున్నా ఎందుకో ఆ సినిమాలు పెద్దగా ఆడట్లేదు.. రొటీన్ పాత్రలు చేస్తూ వెంకీ బోర్ కొట్టిస్తున్నాడని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఆయనకు f2 తప్పా కమర్షియల్ హిట్ ఏదీ లేదంటే ఆశ్చర్యపోవచ్చు..

దాంతో ప్రస్తుతం నారప్ప అనే వెరైటీ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.  పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమై టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు.   తొలి సినిమా హిట్ కాగానే రెండో సినిమా కు ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా ఈ నగరానికేమైంది అనే సినిమా చేశాడు. ఆ సినిమా మోస్తరుగా ఆడింది.. అయితే ఆ సినిమా తరువాత మరో సినిమా చేయడంలో ఎందుకో తరుణ్ భాస్కర్ వెనకపడిపోయాడు.

ఈనేపథ్యంలో అయన తో సినిమా కి వెంకటేష్ ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నారప్ప మూవీతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3లో కూడా నటిస్తున్నాడు. అయితే ఎఫ్2 మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా ఆగష్టులో థియేటర్లోకి రానుందని ఇప్పటికే చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు.దాంతో వెంకీ యువదర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలో ఓ సినిమా ఉంటుందనే వార్తలు గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తుంది. ఇదివరకే ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుందని పుకార్లు కూడా వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. వెంకీ తరుణ్ కలయికలో కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నెల నుండి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా గుర్రపు స్వారీ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా అని టాక్.


ప్రభాస్ ఎదుగుదలను చూసి కోలీవుడ్ అసూయపడుతుందా..?

సౌత్ నుండి ప్రభాస్ ఒక్కడే.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేయొచ్చు...!

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>