WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/pregnancy9dcd3f8b-b983-4c32-9db2-dacf0f417818-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/pregnancy9dcd3f8b-b983-4c32-9db2-dacf0f417818-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వారు తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఏ తల్లిదండ్రులైనా తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా తెలివైన చురుకైన వారుగా ఉండాలని చాల కలలు కంటుంటారు.pregnancy;women;tara;egg;vitamin;woman;professorఅమ్మ: గర్భధారణ సమయంలో ఇవి తింటే.. చురుకైన పిల్లలు పుడుతారంట..!?అమ్మ: గర్భధారణ సమయంలో ఇవి తింటే.. చురుకైన పిల్లలు పుడుతారంట..!?pregnancy;women;tara;egg;vitamin;woman;professorTue, 02 Mar 2021 15:00:00 GMT
అయితే గర్భవతి అయిన మహిళ తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని పచ్చసొన, నట్స్, క్యాబేజీ జాతికి చెందిన కూరగాయల వంటి ఆహారం డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లికడుపులో ఉన్న సమయంలో బిడ్డ మెదడుకు, జ్ఞాపక శక్తికి బూస్ట్ ఇస్తుందన్నారు. గర్భధారణ సమయంలో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయంలోని కొలైన్ విరివిగా తీసుకోవాలని ఓ అధ్యయనం లో తేలింది.

అంతేకాక ఎంత చదువుకున్న మహిళలైనా గర్భ ధారణ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని తర్జన భర్జన పడుతూనే ఉంటారు. అయితే గర్భధారణ సమయంలో చివరి మూడు నెలల్లో తల్లి తీసుకొనే ఆహారం చాలా ముఖ్యం అని.. కొవ్వు తీసేసిన ఎర్ర మాంసం, చేపలు, గుడ్లు, తృణధాన్యాలను ఎక్కువగా తింటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని ఈ అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పదార్ధాలతో బిడ్డ ఎదుగుదల, జ్ఞాపకశక్తి మెరుగుపడిందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో చివరి మూడు నెలలు.. కోలైన్ రిచ్ ఫుడ్స్ తింటే.. పాపాయి ఎదుగుదల బాగుంటుంది.

అలాగే తల్లి గర్భంలోని బిడ్డ పెరుదల పై న్యూ యార్క్ లోని కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, మేరీ కాడిల్ అధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. తమ అధ్యయనంలో రెండు గ్రూపులు గర్భిణీలను పరిశీలించినట్లు మొదటి గ్రూప్ కి రోజూ కోలిన్ మి.గ్రా. ఇవ్వగా… రెండో గ్రూప్ కు రోజు కు 480 మి.గ్రా ఇచ్చారు. కాగా మొదటి గ్రూప్ శిశువు మెదడు అభివృధ్ధి గణనీయంగా పెరిగింది. ఈ ఎఫ్ ఏ ఎస్ ఈ బీ అనే జర్నల్ ఈ అధ్యయనం గురించి ప్రచురించింది.


హాలీవుడ్ రేంజిలో ప్రభాస్ కొత్త సినిమా...?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>