PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-ts-railway-central-tdp-bjp-ycp-janasenafa395d9e-d803-4a71-9dba-d91f07091d7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-ts-railway-central-tdp-bjp-ycp-janasenafa395d9e-d803-4a71-9dba-d91f07091d7f-415x250-IndiaHerald.jpgరైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధ‌ర ఒక్క‌సారిగా ఐదురెట్లు పెరిగింది. రూ.10వేర‌కు ఉన్న టికెట్ ధ‌ర అమాంతం ఐదురెట్లు పెంచ‌డంపై ప్ర‌యాణికులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కానీ తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని రైల్వే అధికారులు స‌మ‌ర్థించుకుంటున్నారు. ముంబ‌యి మెట్రోపాలిటన్ ప్రాంతంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంతో రద్దీని తగ్గించడానికి సెంట్ర‌ల్ రైల్వే ఈ నిర్ణ‌యం తీసుకుంది. ap, ts, railway, central, tdp,bjp, ycp, janasena;kalyan;thane;february;june;chatrapathi;chatrapathi shivaji;march;sivaji;coronavirusఇక‌నుంచి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.50ఇక‌నుంచి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.50ap, ts, railway, central, tdp,bjp, ycp, janasena;kalyan;thane;february;june;chatrapathi;chatrapathi shivaji;march;sivaji;coronavirusTue, 02 Mar 2021 17:05:00 GMT
సెంట్రల్ రైల్వే ప్ర‌యాణికుల‌కు ఒక్క‌సారిగా షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరను 10 రూపాయల నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ధరలను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చింది. పెరిగిన ప్లాట్‌ఫాం ధరలు మార్చి ఒక‌టోతేదీ అర్థ‌రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని సెంట్రల్ రైల్వే ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారి శివాజీ సుతార్ తెలిపారు. పెరిగిన ధ‌ర‌లు జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని శివాజీ వెల్ల‌డించారు.

ముంబ‌యి మ‌హాన‌గ‌రంతోపాటు  పాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఆయా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్ర‌ల్ రైల్వే తెలిపింది. ముఖ్యమైన పండగల సమయంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రెట్టింపు చేస్తారు. కానీ, ఈసారి ఏకంగా ఐదు రెట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముంబ‌యిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్ స్టేష‌న్‌, లోకమాన్య తిలక్ టెర్మినస్‌తో పాటు థానే, కళ్యాణ్, పన్వేల్, భివాండీ రైల్వే స్టేషన్లలో ఈ  ధరలు అమల్లోకి వ‌చ్చాయి. వేసవి కాలంలో సాధారణంగా రైల్వే స్టేషన్లలో రద్దీ పెరుగుతుందని.. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచినట్లు ఒక ప్రకటనలో తెలియ‌జేశారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ముంబ‌యిలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పటివరకు 3.25 లక్షలకు పైగా  కేసులు న‌మోద‌వ‌గా 11,400 మంది మ‌ర‌ణించారు.


ఈ సమ్మర్ లో ఎండలు మరి దారుణం అంట.. జరా జాగ్రత్త మరి.. !

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>