Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricketer-shami-wife-pic-wearing-sindhur-is-going-viral24e6e13b-9291-4ef6-a770-dd3ceb34b2cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricketer-shami-wife-pic-wearing-sindhur-is-going-viral24e6e13b-9291-4ef6-a770-dd3ceb34b2cb-415x250-IndiaHerald.jpgటీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి భార్య, మోడల్ హసిన్ జహాన్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. చక్కగా చీర కట్టుకుని, రెడీ అయిన ఆమె ఫొటో అంతా బాగానే ఉన్నా.. ఆమె నుదుటన సింధూరం ఉండడం ఇప్పుడు తెగ చర్చకు వస్తోంది. హసీన్ జహాన్ సింధూరంతో..virat kohli;india;police;marriage;court;husband;wife;icc t20;mohammed shami;sindhuramవైరల్ అవుతున్న షమి భార్య ఫోటో.. ఆమెకు సింధూరం ఎందుకు..?వైరల్ అవుతున్న షమి భార్య ఫోటో.. ఆమెకు సింధూరం ఎందుకు..?virat kohli;india;police;marriage;court;husband;wife;icc t20;mohammed shami;sindhuramTue, 02 Mar 2021 11:20:40 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి భార్య, మోడల్ హసిన్ జహాన్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. చక్కగా చీర కట్టుకుని, రెడీ అయిన ఆమె ఫొటో అంతా బాగానే ఉన్నా.. ఆమె నుదుటన సింధూరం ఉండడం ఇప్పుడు తెగ చర్చకు వస్తోంది. హసీన్ జహాన్ సింధూరంతో ప్రత్యక్షం కావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. హసిన్ జహాన్ చీర కట్టుకొని సింధూరం పెట్టుకొని దిగిన ఫొటోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.

‘సహనమనే వేలు పట్టుకొని ముందుకు వచ్చాను.. నేను ప్రయాణించిన రహదారి ఆశ్చర్యానికి గురి చేసింది’ అనే కొటేషన్‌ను ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. షమీ, జహన్‌ల మధ్య గత కొంతకాలంగా విబేధాలున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు.

మహ్మద్ షమీ, హసిన్ జహాన్‌లకు ఓ కుమార్తె ఉంది. షమీ, హసిన్‌లు 2014 ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్నారు. అనంతరం షమీపై జహాన్ అనేక సార్లు పోలీసులను ఆశ్రయించారు. కోర్టుకెక్కారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇతర మహిళలతో షమీ సంబంధాలు పెట్టుకున్నాడని జహాన్ ఆరోపించారు. హసిన్ జహాన్ తన చిన్ననాడు సైఫుద్దీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
 
2012లో తన భర్త సైఫుద్దీన్ నుంచి విడిపోయిన జహాన్ షమీని రెండో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొన్నేళ్ల వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. అవి ఇప్పటివరకు తీరలేదు.. అలాంటిది ఇప్పుడు తాజాగా సింధూరంతో ఉన్న ఫోటోను ఆమె పోస్ట్ చేయడంతో అభిమానుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరగనున్న వన్డేలకు మహ్మద్ షమిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌-ఇండియా మధ్య వన్డే సిరీస్ ఈ నెల 23 నుంచి జరగనుంది. మొత్తం 3 వన్డేల్లో ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ తరువాత 14వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 5 టీ20లు ఇరు జట్లు మధ్య జరగనున్నాయి.


ఎడిటోరియల్: తెలంగాణాలో మధ్యంతరం తప్పదా! ఈటెలతో పెట్టుకుంటే అంతేమరి....

హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?

కరోనా కొత్త స్ట్రెయిన్స్.. ఇండియాకు గుడ్‌ న్యూస్..?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?

పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>